రామ్ చరణ్‌ను దున్నపోతుపై ఎక్కించి తిప్పుతున్న ఉపాసన.... (ఫోటోస్)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్యతో కలిసి ఇటీవల లండన్ వెకేషన్ వెళ్లారు. లండన్ వెకేషన్లో తన బర్తను ఉపాసన దున్నపోతు ఎక్కించి తిప్పడం హాట్ టాపిక్ అయింది.

By Bojja Kumar

టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎవరి కెరీర్లో వారు ఎప్పుడూ బిజీగా ఉండే ఈ యంగ్ కపుల్.... ఏ చిన్న విరామం దొరికినా తమకు ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లి రిలాక్స్ అవుతుంటారు.

ప్రస్తుతం 'రంగస్థలం 1985' సినిమా షూటింగులో ఉన్న రామ్ చరణ్ షూటింగ్ గ్యాప్ దొరకడంతో భార్యతో కలిసి వెకేషన్ వెళ్లారు. ఈ ట్రిప్పుకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా ద్వారా అభిమానుల కోసం షేర్ చేసింది.

దున్నపోతుపై రామ్ చరణ్

దున్నపోతుపై రామ్ చరణ్

వెకేషన్లో తన భర్త రామ్ చరణ్‌ను దున్నపోతుపై ఎక్కించి తిప్పుతున్న ఫోటోను ఉపాసన షేర్ చేసింది. ఈ ఫోటో పోస్టు చేసిన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మిస్టర్ సి... అంటే ఎంత లవ్వో

మిస్టర్ సి... అంటే ఎంత లవ్వో


రామ్ చరణ్‌ను ఉపాసన ముద్దుగా ‘మిస్టర్ సి' అని పిలుస్తూ ఉంటుంది. చిన్నతనం నుండే ఫ్రెండ్స్ అయిన చరణ్-ఉపాసన తర్వాత లైఫ్ పార్ట్‌నర్స్ అయిన సంగతి తెలిసిందే. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ. ఇద్దరి మధ్య అనుబంధం ఎలా ఉందో చెప్పడానికి ఈ ఫోటోలే నిదర్శనం.

ఉపాసన ఫ్యామిలీతో కూడా

ఉపాసన ఫ్యామిలీతో కూడా

రామ్ చరణ్, ఉపాసన చిన్నతనం నుండే ఫ్రెండ్స్ కావడంతో అప్పటి నుండే ఉపాసన ఇంట్లో ఒక సభ్యుడిగా మెలిగేవాడట చరణ్. అందుకే ఉపాసన... తాత, అమ్మమ్మతో కూడా చెర్రీకి మంచి అనుబంధం ఉంది.

దిపావళి సెలబ్రేషన్స్

దిపావళి సెలబ్రేషన్స్

ఇటీవల జరిగిన దీపావళి వేడుకలో రామ్ చరణ్, ఉపాసన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి హ్యాపీగా గడిపారు. ఆ సందర్భంలో దిగిన ఈ ఫోటోను ఉపాసన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X