కొత్త ఇంటిని కొన్న రాంచరణ్.. ధర ఎన్ని కోట్లో తెలుసా, సౌత్ ఇండియాలోనే..

Recommended Video

Ram Charan Buys A New House For Mind Blowing Cost | Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సౌత్ ఇండియాలో రిచెస్ట్ సెలబ్రిటీలలో ఒకరు. మెగా వారసుడిగా, స్టార్ హీరోగా చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. రాంచరణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రాంచరణ్ హీరోగా మాత్రమే కాదు నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. కొన్ని సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పనిచేస్తున్నాడు. తాజాగా రాంచరణ్ కొత్త ఇంటిని కొనుగోలు చేశాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

విలాసవంతమైన ఇల్లు

విలాసవంతమైన ఇల్లు

రాంచరణ్ ఇటీవలే జూబ్లీహిల్స్ లో ఓ ప్రధాన ప్రాంతంలో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఇంటి ధర మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. 38 కోట్లతో రాంచరణ్ కొత్త ఇంటిని కొన్నట్లు తెలుస్తోంది. మరే సౌత్ ఇండియన్ సెలెబ్రిటీకి ఇంత ఖరీదైన ఇల్లు లేదని అంటున్నారు. 2007 లో చిరుత చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్ సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు.

అన్ని రకాలుగా సంపాదన

అన్ని రకాలుగా సంపాదన

రాంచరణ్ ఆస్తుల నికర విలువ 1300 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి చిత్రానికి రాంచరణ్ 15 కోట్లకుపైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక వివిధ వ్యాపారాలు, సినిమా నిర్మాణం, ఎండార్స్మెంట్ లో కూడా రాంచరణ్ సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం రాంచరణ్ కొనుగోలు చేసిన ఇంటి ధర టాలీవుడ్ వర్గాలని సైతం అవాక్కయ్యేలా చేస్తోంది.

ఖరీదైన కార్లు

ఖరీదైన కార్లు

రాంచరణ్ కు అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. ఖరీదైన వాహనాలు, గుర్రాలని పెంచడంపై రాంచరణ్ కు అభిలాష ఉంది. అప్పుడప్పుడూ తన ఫామ్ లో చరణ్ వివిధ రకాల పక్షులతో కూడా కనిపిస్తుంటాడు. టాలీవుడ్ లోకి మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక రాంచరణ్ నిర్మాతగా కూడా మారాడు. ఖైదీ నెం 150 చిత్రం రాంచరణ్ నిర్మాణంలోనే రూపొందింది. ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని కూడా రాంచరణే భారీబడ్జెట్ లో రూపొందిస్తున్నాడు. 200 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఆర్ఆర్ఆర్ చిత్రం

ఆర్ఆర్ఆర్ చిత్రం

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. బాహుబలితో అద్భుతాలు చేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో ఎలాంటి సంచలనాలు నెలకొల్పుతాడో అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్ కలసి నటిస్తున్నారు. ఎన్టీఆర్ దొంగగా, రాంచరణ్ పోలీస్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X