హాట్ టాపిక్: 3.5 కోట్లతో రామ్ చరణ్ కొత్త కారు
హైదరాబాద్: ఎవరి రేంజికి తగిన విధంగా వారి అభిరుచులు ఉంటాయి. కోటీశ్వరుల అభిరుచులు కోట్ల రూపాయల వస్తువలు చుట్తూ తిరుగుతూ ఉంటాయి. తాజాగా రామ్ చరణ్‌కు ఖరీదైన విలాస వంతమైన కార్లు అంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఆయన వద్ద ఆస్టన్ మార్టిన్ లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. ఆ మధ్య తన తండ్రికి కోటిపైనే విలువ చేసే కారు గిఫ్టుగా ఇచ్చాడు.

తాజాగా రామ్ చరణ్ కొత్త కారు కొన్నారు. విలువ రూ. 3.5 కోట్లపైనే. లాండ్ రోవర్ సంస్థ పరిచయం చేసిన 'రేంజ్ రోవర్' ఆటోబయోగ్రఫీ ఎడిషన్ ను రామ్ చరణ్ సొంతం చేసుకున్నాడు. అత్యంత విలాసవంతమైన ఈ కారును ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఖరీదు చేసిన తొలి కస్టమ్ రామ్ చరణే కావడం విశేషం.
రామ్ చరణ్ ఈ కారును నిన్న రాత్రి జరిగిన టాలీవుడ్ మేము సైతం క్రికెట్ టీమ్స్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి స్వయంగా ఈ కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు రామ్ చరణ్. ఆకారులో చరణ్ తో పాటు అక్కినేని అఖిల్ కూడా ఉండటం గమనార్హం. కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకునే రామ్ చరణ్ లాంటి స్టార్స్‌కి ఇలాంటి ఖరీదైన కార్లు కొనడం పెద్ద లెక్కేమీ కాదు..


Click it and Unblock the Notifications











