వంద మందిని చంపిన యోధుడు లవర్ బాయ్ కాగలడా...!?

By Sindhu

మొదటి రెండు సినిమాల్లో మాస్ హీరోగా కనిపించి మెప్పించిన రామ్ చరణ్ మూడో సినిమాకే మొత్తం సెటప్పు, గెటప్పు అన్నీ మార్చేశాడు. లవర్ బాయ్ వేషం కట్టానని చెబుతూ చెదిరిన క్రాపు, చిరిగిన జీన్సు వేసుకుని ట్రెండీగా, స్టైలిష్ గా దర్శనమిస్తున్నాడు. అయితే 'చిరుత"లో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా, 'మగధీర" లో వంద మందిని చంపే యోధుడిగా నటించిన చరణ్ 'ఆరెంజ్" లో అమ్మాయిలని పటాయించే కుర్రాడి పాత్ర పోషిస్తున్నాడు. ఇలా కనిపించడం కోసం చరణ్ పడిన కష్టం తెలుస్తోంది కానీ ఈ విధంగా అతడిని చూడ్డానికి జనం ఇష్టపడతారా అనేదే అనుమానంగా ఉంది.

లవర్ బాయ్ పాత్రయితే వేసేశాడు కానీ లవర్ బాయ్ కి ఉండాల్సిన లక్షణాలయితే అతడిలో ఏమీ కనిపించడం లేదు. మాస్ పాత్రలు పోషించడానికి లుక్స్ తో పని లేదు కానీ ఇలాంటి పాత్రలకి అందంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. కానీ చరణ్ కి గ్లామర్ పరంగా పడేది చాలా తక్కువ మర్కులే కనుక అతడిని ఈ యాంగిల్ లో చూసేందుకు జనం ఇష్టపడకపోవచ్చు. ఇలాంటి పాత్రలు చేయడానికి అతను మళ్లీ దైర్యం చేస్తాడా లేదా అనేది 'ఆరెంజ్" రిజల్ట్ బేస్ అయి ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X