నిశ్చితార్థం నమ్మలేకపోతున్నంటూ రామ్ చరణ్

By Srikanya

రామ్‌ చరణ్, ఉపాసన కామినేనిల నిశ్చితార్థం ఈ రోజు (డిసెంబరు ఒకటి)వ తేదీన ఘనంగా జరుగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎంగేజ్ మెంట్ విషయమై రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ...నేను మరికొద్ది గంటల్లో ఎంగేజ్ కాబోతున్నాననే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. మీ శుభాకాంక్షలు(విషెష్) అన్నిటికీ అడ్వాన్సెడ్ ధాంక్స్. లవ్ యు గైస్ అంటూ ట్వీట్ చేసారు. ఆయన తన ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ ఈ ట్వీట్ చేసారు.

రంగారెడ్డి జిల్లా మెయినాబాద్‌లో చిలుకూరు బాలాజీ టెంపుల్ సమీపంలో ఉన్న ఉపాసన కామినేని ఫామ్‌హౌస్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. నిశ్చితార్థం మహూర్తం దగ్గరపడుతుండటంతో ఇందుకోసం ఏర్పాటు చురుగ్గా సాగుతున్నాయి. సాయంత్రం 7.30 గంటలకు జరిగే ఈ నిశ్చితార్థం కార్యక్రమానికి ఇరువర్గాల బంధువులతో పాటు, సినీ పరిశ్రమలోని సన్నిహితులు, రాజకీయనాయకులు హాజరుకానున్నారు. చిరంజీవి దగ్గరుండి ఈ నిశ్చితార్థం ఆహ్వాన పత్రికలను పంచుతున్నారు.

రామ్ చరణ్, ఉపాసన ల ఎంగేజ్ మెంట్ గిప్టుగా ఛార్టెడ్ ప్లైట్ ని ఇవ్వనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై రామ్ చరణ్ కాబోయే శ్రీమతి ఉపాసన స్పందిస్తూ అట్లాంటి బహుమతిలు ఏమీ తమ కుటుంబం ఇవ్వటం లేదని ఖండించారు. అలాగే రామ్ చరణ్ కూడా అట్లాంటి వాటిని తీసుకోరని, ఆ డబ్బుని ఆయన ఛారెటీ పర్పస్ కి ఖర్చుపెడతారని అన్నారు.

ఇక ఎంగేజ్ మెంట్ కు వచ్చేవారు ఆహ్వాన పత్రికతో పాటు, బార్‌కోడ్ ఉన్న ఓ కార్డును ఇస్తున్నారు. కార్యక్రమానికి వచ్చే వారు దీనిని వెంటబెట్టుకుని రావాలి. ఇది ఎంట్రెన్స్‌లో యాక్సెస్ అయితేనే లోపలికి ప్రవేశం ఉంటుంది. భద్రతా కారణాల రీత్యా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ కార్యక్రమం కోసం మూడంచెలుగా భద్రతను ఏర్పాటు చేశారు. ఇది పూర్తిగా ప్రైవేటు కార్యక్రమని, అభిమానులకు ప్రత్యేకంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి రామ్‌ చరణ్, ఉపాసన కామినేనులను పరిచయం చేయనున్నామని సంబంధీకులు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X