twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేసు కొట్టివేత: దాడి కేసులో రామ్ చరణ్‌కు ఊరట

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సాఫ్ట్ వేర్ ఇంజనీర్లపై దాడి చేసాడనే ఆరోపణలతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌పై రాష్ట్రమావ హక్కుల కమీషన్లో సలీం అనే న్యాయవాది దాఖలు చేసిన పిటీషన్ కొట్టివేయబడింది. సరైన ఆధారాలు లేని కారణంగా కమీషన్ ఈ పిటీషన్‌ను తోసిపుచ్చింది.

    రామ్ చరణ్ తమపై దాడి చేసారని ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయలేదనే విషయాన్ని పిటీషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు కానీ...వారిని కనీసం కమీషన్ ముందు హాజరు పరుచలేదు. సరైన ఆధారాలు లేకుండా ఎవరినీ దోషులుగా తేల్చలేం అని కాకుమాను పెదపేరిరెడ్డి, మిరియాల రామారావులతో కూడిన ధర్మాసనం పిటీషన్‌ను తిరస్కరించింది.

    Ram Charan Teja

    ఇటీవల బంజారాహిల్స్‌లో నడిరోడ్డుపై ఇద్దరు వ్యక్తులపై రామ్ చరణ్ బాడీగార్డులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సలీం అనే న్యాయవాది హెచ్‌ఆర్‌సి‌ని ఆశ్రయించి రామ్ చరణ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. దాడి సంఘటనను సుమోటాగా తీసుకుని కేసు నమోదు చేయాలని, బాధితులు ఫిర్యాదు చేయలేదనే కారణంగా కేసు పెట్టక పోవడం వెనక కేంద్ర మంత్రి చిరంజీవి ఒత్తిడి ఉందని ఆయన పేర్కొన్నారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా దాడి కేసును సుమోటోగా స్వీకరించాలని కోరారు.

    పట్టపగలు నడి రోడ్డుపై ఇంత దౌర్జన్యకాండ జరిగినా...ఈ దాడికి ఉసిగొల్పిన రామ్ చరణ్‌పై గానీ, అతని బాడీగార్డులపై గానీ పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఇదే విషయం పోలీసులను అడిగితే బాధితులు ఫిర్యాదు చేయలేదు కాబట్టి కేసు నమోదు చేయలేదని సమాధానం ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశం అయింది.

    English summary
    AP State Human Rights Commission dismissed case against film actor Ram Charan teja Due to lack of evidence.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X