CCL-3లో రామ్ చరణ్ (క్రికెట్ ప్రాక్టీస్ ఫోటోలు)
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అభిమానులకు శుభవార్త. త్వరలో ప్రారంభం కానున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 3వ సీజన్లో చెర్రీ తెలుగు వారియర్స్ తరుపున పాల్గొనబోతున్నాడు. ఈ మేరకు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు. సినిమాల్లో బ్యాట్ పట్టి సిక్సులు, ఫోర్లు బాదిన చెర్రీ....రియల్ పిచ్‌పై ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడో చూడాలి.
ఫిబ్రవరి 9వ తేదీ నుంచి CCL-3 టెర్నీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కేరళలోని కొచ్చిలో జరుగనుంది. CCL-3కి సంబంధించి కర్టెన్ రైజర్(జట్ల పరిచయ వేదిక) కార్యక్రమం జనవరి 19న ముంబైలోని ఫిల్మ్ సిటీలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్టేజ్ ఫెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
బిపాస బసు, కాజల్ అగర్వాల్ ఈ టోర్నమెంటుకు బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరిస్తున్నారు. గత సంవత్సరం వరకు తెలుగు, తమిళం, కేరళ, కర్నాటక, హిందీ ఇలా 5 పరిశ్రమలకు చెందిన ఐదు టీంలు మాత్రమే ఉండేవి. అయితే ఈ సంవత్సరం నుంచి మరో రెండు టీంను అదనంగా చేరబోతున్నాయి. ఈ సంవత్సరం మరాఠీ, బోజ్ పురి టీంలు కూడా జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న రామ్ చరణ్

క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న రామ్ చరణ్

క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న రామ్ చరణ్

క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న రామ్ చరణ్
ఐపీఎల్ లో నైట్ పార్టీల మాదిరి........సిసిఎల్‌లో కూడా సిసిఎల్ గ్లామ్ నైట్స్-2013 పేరుతో పార్టీలను ఏర్పాటు చేయబోతున్నారు. సిసిఎల్-3 టోర్నీ ప్రారంభమైన తర్వాత ప్రతి రోజూ రాత్రి జరిగే ఈ పార్టీల్లో సినీ తారలు సందడి చేయనున్నారు.


Click it and Unblock the Notifications











