twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీడియో: మంత్రికే సవాల్ విసిరిన రాంచరణ్.. దుమ్ము దులిపేశాడు, చిరంజీవితో పాటు మెగా ప్రిన్స్‌కి కూడా!

    |

    Recommended Video

    మంత్రికే సవాల్ విసిరిన రాంచరణ్..చిరంజీవితో పాటు మెగా ప్రిన్స్‌కి కూడా!

    ఇండియా మొత్తం ఫిట్ నెస్ ఛాలెంజ్ వైరల్ అయిపోయింది. కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ ప్రారంభించిన ఈ ఫిట్ నెస్ ఛాలెంజ్ ని సెలెబ్రిటీలంతా చేసి చూపిస్తున్నారు. రోజువారి జీవితంలో ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండడం ఎంత ముఖ్యమో ప్రజలకు తెలియజేయడమే దీని ఉద్దేశం.టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా ఫిట్ నెస్ ఛాలెంజ్ ని స్వీకరించి మరికొందరికి సవాల్ విసురుతున్నారు. ఎన్టీఆర్, నాగార్జున, అఖిల్ వంటి సెలెబ్రిటీలంతా తమ ఫిట్ నెస్ సెక్రేట్స్ ని సోషల్ మీడియాలో వీడియో రూపంలో పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రాంచరణ్ కూడా తన ఫిట్ నెస్ నిరూపించుకుని మరి కొందరిని సవాల్ చేశాడు.

    తారక్ సవాల్

    తారక్ సవాల్

    ఇటీవల ఎన్టీఆర్ కూడా తన ఫిట్ నెస్ వీడియోని పోస్ట్ చేసాడు. ఈ సందర్భంగా రాంచరణ్ కు ఎన్టీఆర్ సవాల్ విసిరాడు. ఎన్టీఆర్ సవాల్ స్వీకరించిన రాంచరణ్ తాజాగా తన ఫిట్ నెస్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

    రాంచరణ్ ఎనర్జీ

    బాక్సింగ్ పంచ్ లు విసురుతూ రాంచరణ్ ఈ వీడియోలో ఎనర్జిటిక్ గా కనిపించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రాంచరణ్ దుమ్ము దులిపేశాడని చెప్పొచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

     మంత్రికే సవాల్

    మంత్రికే సవాల్

    ఈ సందర్భంగా మరో ఐదుగురికి రాంచరణ్ తన సవాల్ విసిరాడు. వారిలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఉండడం విశేషం. కేటీఆర్, రాంచరణ్ ఇటీవల సన్నిహితంగా ఉండడం గమనిస్తూనే ఉన్నాం. రాంచరణ్ ఫిట్ నెస్ ఛాలెంజ్ కు కేటీఆర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

    చిట్టిబాబు సృష్టికర్త

    చిట్టిబాబు సృష్టికర్త

    రాంచరణ్ సవాల్ విసిరిన వారిలో చిట్టిబాబు సృష్టికర్త దర్శకుడు సుకుమార్ కూడా ఉన్నారు. సుకుమార్ తో పాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని కూడా రాంచరణ్ ఛాలెంజ్ చేశాడు. వీళ్ళిద్దరూ స్పందించాల్సి ఉంది.

    సవాల్‌లో కొసమెరుపు

    సవాల్‌లో కొసమెరుపు

    రాంచరణ్ సవాల్ లో మరో కొసమెరుపు కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవిని కూడా ఈ మెగా పవర్ స్టార్ ఛాలెంజ్ చేశాడు. సైరా నరసింహారెడ్డి షూటింగ్ తో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరు.. రాంచరణ్ సవాల్ కు ఎలా స్పందిస్తాడో చూడాలి.

    English summary
    Ram Charan Challenges KTR and Megastar. Ram Charan accepts NTR challenge
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X