రామ్ చరణ్, వినాయక్ మూవీ ‘చెర్రీ’ డీటేల్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అంతా ముద్దుగా చెర్రీ అని పిలుస్తుంటారు. ఇంట్లో వాళ్లూ .. సన్నిహితులు... మిత్రులూ చరణ్ ని అదే పేరుతో పిలుస్తుంటారు. ఇప్పుడు ఈ పేరునే అతని సినిమాకి టైటిల్ గా పెడుతున్నట్టు తెలుస్తోంది. వివి వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం కోసం 'చెర్రీ' టైటిల్ని దాదాపు ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం షూటింగు ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నెం.8లోని పాటియాలా హౌస్‌లో జరుగుతోంది. ఇక్కడ చరణ్, రాహుల్ దేవ్, రఘు బాబు ఇతరులపై సీన్లు చిత్రీకరిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి తర్వలో యూరప్ లో షూటింగు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో చరణ్ పక్కన కాజల్, అమలాపాల్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. యూనివేర్సల్ మీడియా బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
'చెర్రీ' చిత్రానికి ఆకుల శివ కథ అందించారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతున్నారు. బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, సత్యం రాజేష్, సుధా రాహుల్ దేవ్, రఘుబాబు, ఎంఎస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
దర్శకుడు వినాయక్ చిత్రం గురించి చెబుతూ ..చిరంజీవిగారితో 'ఠాగూర్' తీసిన రోజులు గుర్తొస్తున్నాయి. తప్పకుండా అందరినీ మెప్పించే సినిమా తీస్తామని అన్నారు. నిర్మాత ఈ చిత్రం గురించి మాట్లాడుతూ...చరణ్‌ని ఒక కొత్త తరహా పాత్రలో చూపెట్టబోతున్నారు దర్శకుడు. వినోదం, యాక్షన్... తదితర అంశాలు అభిమానుల్ని మెప్పించేలా ఉంటాయి. వాణిజ్య విలువలతో కూడిన కథాంశమిది. వినోదాత్మకంగా సాగుతుంది.
చరణ్ ఈ చిత్రంతో పాటు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంలో, అపూర్వ లఖియా దర్శకత్వంలో బాలీవుడ్ మూవీ 'జంజీర్' చేస్తున్నారు. ఇప్పటికే 'రచ్చ' భారీ విజయంతో మంచి జోస్ మీదన ఉన్న చరణ్ తన తదుపరి చిత్రాలపై కూడా భారీ ఆశలే పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











