అమలతో రామ్ చరణ్ ‘చిలుకా క్షేమమా..’
చిరంజీవి-శోభన జంటగా నటించిన 'రౌడీ అల్లుడు' చిత్రంలోని 'చిలుకా క్షేమమా...' అనే పాట ఎంత ఫేమసో కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ రొమాంటిక్ మెలోడియస్ సాంగంటే ఇప్పటికీ సంగీత అభిమానులు చెవి కోసుకుంటారు. తాజాగా ఈ పాటను రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే...మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్-వివి వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్‌ను ఇప్పటికే హీరోయిన్ గా ఎంపిక చేయగా, ఇటీవల అమలపాల్‌ను సెకండ్ హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు.
ఈచిత్రంలో రామ్ చరణ్-అమలపై 'చిలుకా క్షేమమా..' అనే పాటను ప్లాన్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మగధీర సినిమాలో 'బంగారు కోడి పెట్ట' పాటను రిమీక్స్ చేసి సక్సెస్ అయిన చెర్రీ. రచ్చ సినిమాలో వాన వాన వెల్లువాయే పాటలో కూడా కనిపించబోతున్నాడు.
సంపత్ నంది దర్శకత్వం వహించిన 'రచ్చ' సినిమాను మార్చి 29న గానీ ఏప్రిల్ 5న గానీ విడుదల చేసే యోచనలో ఉన్నారు. మెగా సూపర్ గుడ్ బ్యానర్‌పై ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











