Ayodhya Ram Mandir అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట... పయనమైన టాలీవుడ్ రాముడు

అయోధ్యలో 22వ తేదీన శ్రీరాముడి ఆలయం ప్రాణ ప్రతిష్ట జరగబోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ఈ కార్యక్రమానికి తెలుగు సినీ పరిశ్రమ నుంచి పలువురు హీరోలకు ఆహ్వానం అందింది. మెగాస్టార్ చిరంజీవి ఆయన కుమారుడు రామ్ చరణ్ తేజ్ ఇద్దరికీ ఆహ్వానం అందడం ఆసక్తికరంగా మారింది. ఇక వారిద్దరూ అయోధ్య బయలుదేరుతున్న క్రమంలో వారిని ఎయిర్ పోర్ట్ వరకు సాగనంపేందుకు అభిమానులు పెద్ద ఎత్తున వారి ఇంటి ముందు గుమిగూడారు. ఆ వివరాల్లోకి వెళితే...

శ్రీ రాముడి జన్మస్థలమైన అయోధ్యలో దేవాలయం నిర్మించి అక్కడ బాల రాముడిని ప్రతిష్టించబోతున్న శుభ ఘడియలు దగ్గర పడ్డాయి. జనవరి 22వ తేదీన ప్రధానమంత్రి మోడీ అలాగే అయోధ్య రామమందిర ట్రస్ట్ ఆధ్వర్యంలో విగ్రహాన్ని స్థాపించబోతున్నారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న పలు రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. బాలీవుడ్ హీరోలు సహా తెలుగు హీరోలకు సైతం ఈ ఆహ్వానాలు

Ram Charan, Chiranjeevi, PawanKalyan Going to Ayodhya To Attend Ram Mandir Pran Pratishtha Full Details Here

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ వంటి వారికి ఈ ఆహ్వానాలు అందగా మిగతా వారి పరిస్థితి ఎలా ఉందో తెలియదు గానీ మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు రాంచరణ్ తో కలిసి అక్కడికి వెళ్లబోతున్నారు. ఈ విషయాన్ని హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే మెగాస్టార్ చిరంజీవి అనౌన్స్ చేశారు.

ఇక ఈరోజు వీరిద్దరూ కలిసి అయోధ్య బయలుదేరుతున్న సమయానికి మెగా అభిమానులు పెద్ద ఎత్తున వారి ఇంటి ముందు గుమికూడారు. జై శ్రీరామ్ నినాదాలతో పాటు జై చిరంజీవ నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. ఇక అయోధ్యలో జరుగుతున్న మహత్తర ఘట్టానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో సుధీర్ఘంగా రాసుకొచ్చారు. వీరు కుటుంబ సభ్యులతో ఈ వేడుకకు హాజరవుతారా లేక వ్యక్తిగతంగా హాజరవుతారా అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది.

Ram Charan, Chiranjeevi, PawanKalyan Going to Ayodhya To Attend Ram Mandir Pran Pratishtha Full Details Here

ఇక చిరంజీవి ట్విట్టర్ లో ఈ మేరకు పేర్కొన్నారు. రామ మందిర నిర్మాణం చరిత్ర సృష్టిస్తోంది, చరిత్రను ఉర్రూతలూగిస్తోంది, చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తోంది. ఇది నిజంగా ఒక అపరిమితమైన అనుభూతి. ఈ ఆహ్వానాన్ని అయోధ్యలో రామ్‌లల్లాకు పట్టాభిషేకం చేయడానికి ఒక దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తున్నాను.ఐదు వందల సంవత్సరాలకు పైగా తరతరాలుగా భారతీయుల నిరీక్షణ ఫలించబోతున్న ఆ మహత్తర అధ్యాయం... అంటూ రాసుకువచ్చారు.

ఆ దివ్యమైన 'చిరంజీవి' హనుమంతుడు, అంజనా దేవి కుమారుడే స్వయంగా ఈ భూలోక అంజనాదేవి కొడుకు చిరంజీవికి ఈ అమూల్యమైన క్షణాలను చూసే బహుమతిని ఇచ్చినట్లు నాకు అనిపిస్తుంది. నిజంగా ఇది వర్ణించలేని అనుభూతి. నాకు మరియు నా కుటుంబ సభ్యులకు ఎన్నో జన్మల పుణ్యఫలం. గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ గారికి హృదయపూర్వక అభినందనలు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి జీకి హృదయపూర్వక అభినందనలు. ఈ మహత్తర సందర్భంలో ప్రతి భారతీయునికి హృదయపూర్వక అభినందనలు. రేపటి బంగారు క్షణాల కోసం ఎదురుచూస్తున్నా. జై శ్రీ రామ్ అని మెగాస్టార్ చిరంజీవి రాసుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X