ఆ రోజు అలా మాట్లాడటానికి కారణం ఇది : రామ్ చరణ్
హైదరాబాద్ : గత మూడేళ్లుగా నేను అనుభవించిన మానసిక సంఘర్షణ తాలూకు ప్రతిస్పందన అది. మనపై వస్తున్న విమర్శలకు జవాబు ఇవ్వలేకపోతే జనాలు వాటిని నిజమని నమ్మే ప్రమాదముంది అన్నారు. 'నాయక్' ఆడియో వేడుకలో మీడియా వెంట్రుకతో సమానమని రామ్ చరణ్ వ్యాఖ్యానించారు. ఆ మాటల వెనకున్న భావోద్వేగాలు గురించి మీడియాతో ఇలా మాట్లాడారు.
అలాగే ఎలక్షన్స్ పూర్తయిన దగ్గరినుంచి ఓ పత్రిక మా కుటుంబంపై అసత్య కథనాలు రాయడం మొదలుపెట్టింది. అబద్ధాల్ని పదే పదే చెబుతూ వాటినే నిజమని నమ్మింపజేసే ప్రయత్నం జరిగింది. ఓ మంచి వ్యక్తిని చూపించి 'ఇతనే దొంగ...' అని పదే పదే చెబితే సమాజం నిజంగా అతన్ని దొంగ అనుకుంటుంది అందుకే అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.
ఇక అలాంటి వార్తలపై కల్యాణ్ బాబాయ్ కూడా స్పందించాల్సిన అవసరం లేదనేవారు. అయితే మన పనిలో మనం వుంటే..విమర్శకులు వాళ్ల పనిలో వాళ్లుంటున్నారు. అందుకే నేను వాస్తవమేమిటో స్పష్టం చేయదలచుకున్నాను. ఏది నిజమో చెప్పాలనకున్నాను. అందుకే 'నాయక్' ఆడియో వేడుకలో అలా మాట్లాడాల్సి వచ్చింది. అయితే అవి మొత్తం మీడియాను ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలు కావు. అలాంటి కథనాలు రాసిన వ్యక్తికి మాత్రమే ఆ వ్యాఖ్యలు వర్తిస్తాయి అన్నారు.


Click it and Unblock the Notifications











