చిరు 150వ సినిమాపై రామ్ చరణ్ క్లారిటీ
హైదరాబాద్: రామ్ చరణ్ తేజ తన తండ్రి చిరంజీవి 150 చిత్రం గురించి మరోసారి మీడియాతో మాట్లాడారు. ఆయన ఈ విషయమై స్పందిస్తూ.. "రెండు విషయాలు ష్యూర్ గా చెప్పలగలను. అవి ఒకటి నేను నాన్నగారి సినిమాని నిర్మించటం, రెండవది నాన్న గారు ఆ సినిమాలో చేయటం. మిగతవన్ని ఇప్పుడు చెప్పలేను. ఎందుకంటే పనులు జరుగుతున్నాయి. నా టీమ్ కూడా స్క్రిప్టులు వింటోంది. నాన్నగారు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ముందుకు వెళ్దామంటే అప్పుడే సినిమా షూట్ మొదలవుతుంది" అని అన్నారు.
చిరంజీవి 150 చిత్రానికి వివి వినాయక్ దర్శకుడు అంటూ బయట ప్రచారం జరుగుతోంది. మరో ప్రక్క రాజమౌళి ఈ చిత్రం తాను చేయనని కావాలంటే స్క్రిప్టు ఇవ్వగలనని ప్రకటించారు. ఈ నేఫధ్యంలో మీడియావారు రామ్ చరణ్ ని కలిసి అడిగితే ఈ విధంగా స్పందించారు. మొదటి నుంచి రామ్ చరణ్ తన తండ్రి 150 చిత్రాన్ని తానే స్వయంగా నిర్మిస్తానని చెప్తున్నారు. అదే విషయం ఆయన మరోసారి స్పష్టం చేసారు.
ఇక తన జంజీర్ రీమేక్ లో తనతో పాటు చేస్తున్న ప్రియాంక చోప్రా గురించి కూడా రామ్ చరణ్ మాట్లాడారు. ఆయన ప్రియాంక గురించి మాట్లాడుతూ..."నేను ఆమె బ్రిలియెంట్ ఫెరఫార్మెన్స్ చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఆమె గతంలో చేసిన కమీనే,ఫ్యాషన్ చిత్రాలు నాకు చాలా ఇష్టం. అలాగే సాత్ ఖూన్ మాఫ్ చిత్రంలో ఆమె అద్బుతంగా చేసింది. ఆమెతో చేయటం, పోటీ పడటం నాకు ఛాలెంజ్ లాంటిదే. ఆమెతో సెప్టెంబర్ చివరి నుంచి షూటింగ్ లో తిరిగి పాల్గొంటాను" అన్నారు.
గతంలో 'ముంబై సే ఆయా మేరా దోస్త్', 'ఏక్ అజ్‌నబీ', 'షూటవుట్ ఎట్ లోఖండ్‌వాలా' చిత్రాల్ని రూపొందించిన అపూర్వ లఖియా ఈ రీమేక్ కి దర్శకుడు. 1973లో సూపర్ హిట్ అయిన అమితాబ్ బచ్చన్ సినిమా 'జంజీర్'కు ఇది రీమేక్. రాంచరణ్ సరసన ప్రియాంకా చోప్రా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, అర్జున్ రాంపాల్, మహీ గిల్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు. పాత 'జంజీర్' దర్శకుడు ప్రకాశ్ మెహ్రా కుమారుడే ఈ అమిత్. తన తండ్రి సాధించిన విజయాన్ని ఈ చిత్రంతో కొనసాగించలనుకుంటున్నాని చెప్తున్నాడు.


Click it and Unblock the Notifications











