తేజ్ ఐ లవ్ యూ.... రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్

By Bojja Kumar

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న చిత్రం 'తేజ్‌'. ఐ లవ్‌ యూ అనేది ఉపశీర్షిక.

ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూసిన రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్ చేశాడు. 'తేజ్ ఐ లవ్ యూ' సినిమా ట్రైలర్ చూశాను. విజువల్స్, మ్యూజిక్ చాలా బావుంది. కరుణాకరన్ నుండి జూన్ 6న మరో ప్రామిసింగ్ మూవీ వస్తున్నట్లు కనిపిస్తోంది. నిర్మాత కెఎస్ రామారావు, సాయి ధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్‌కు ఆల్ ది బెస్ట్' అని రామ్ చరణ్ తన ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు.

ఈ చిత్రాన్ని జూలై 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఈ సారి దర్శకుడు కరుణాకరన్ మ్యాజిక్ వర్కౌట్ అయ్యేట్లు కనిపిస్తోంది.

Ram Charan comment about Tej I Love You movie

సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌, జయప్రకాశ్‌, పవిత్రా లోకేశ్‌, ప థ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్‌ రవి, అరుణ్‌ కుమార్‌ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి లిరిక్స్‌: చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి, పోతుల రవికిరణ్‌, గోశాల రాంబాబు, స్టంట్స్‌: వెంకట్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సతీశ్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: మోహన్‌, చీఫ్‌ కో డైరెక్టర్‌: చలసాని రామారావు, ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఆర్ట్‌: సాహి సురేశ్‌, సంగీతం: గోపీ సుందర్‌, సినిమాటోగ్రఫీ: అండ్రూ.ఐ, మాటలు: డార్లింగ్‌ స్వామి, సహ నిర్మాత: వల్లభ, నిర్మాత: కె.ఎస్‌.రామారావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X