twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాద్‌షా' దుర్ఘటనపై .. రామ్‌చరణ్ కామెంట్!?

    By Srikanya
    |

    హైదరాబాద్ : "పబ్లిక్ ఫంక్షన్లలో దుర్ఘటనలు చోటుచేసుకోవడానికి కారణం ప్లానింగ్ లోపమే. మనం ఎలాంటి ఫంక్షన్ చేస్తున్నాం. ఎంపిక చేసుకున్న ప్రదేశంలో ఎంత మంది పడతారు. దాని కెపాసిటీ ఎంత? ఎన్ని టిక్కెట్లు పంచుతున్నాం అనే విషయంపై అవగాహన ఉండాలి. ఈవెంట్ మేనేజ్‌మెంట్ వారు ఈ విషయాలపై శ్రద్ధ తీసుకోవాలి. లేకుంటే అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటాయి'' అని అంటున్నారు రామ్‌చరణ్.

    బాద్‌షా సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మృతి చెంందిన విషయం తెలిసిందే. ఈ విషయమై సర్వత్వా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో రామ్ చరణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

    రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'ఎవడు' చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. రామ్‌చరణ్ మాట్లాడుతూ "మేం 'రచ్చ', 'నాయక్' ఫంక్షన్లు చేశాం. నా పెళ్లిలో కూడా ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాం. అవన్నీ పక్కా ప్రణాళిక ప్రకారం చేశాం. ఏ ఫంక్షన్లయినా అలా సాగితే బావుంటుంది. ఫ్యాన్స్ కూర్చోవడానికి అన్నీ ఏర్పాట్లున్నాయా? బ్యారికేడ్లు దృఢంగా ఉన్నాయా? వంటి అంశాలను ముందే చెక్ చేసుకోవాలి అన్నారు.

    సరైన వసతులు సమకూర్చలేని పరిస్థితుల్లో ఫ్యాన్స్‌ను ఇబ్బంది పెట్టవద్దని మేం స్వామినాయుడుకు ముందే చెప్తాం. నా పుట్టినరోజున సాయంత్రం అన్నీ పకడ్బందీ సౌకర్యాలతో 'జంజీర్', 'ఎవడు' చిత్రాల ఫస్ట్‌లుక్‌ను, టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేయనున్నాం'' అని చెప్పారు. త్వరలో కొరటాల శివతోనూ, త్రివిక్రమ్‌తోనూ, సురేందర్‌రెడ్డి పనిచేయనున్నట్టు చరణ్ తెలిపారు.

    English summary
    
 Ram Charan said...."My fans have planned a grand birthday celebration for me in Hyderabad and I will surely be there. We are also releasing the teasers of two films on this day," reveals Charan, adding, "We have taken all security measures into account for this event."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X