Ram Charan: బంగారు తెలంగాణ నిజమవుతోంది.. రామ్ చరణ్ ట్వీట్ వైరల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయాడు. మెగాస్టార్ చిరంజీవి, చెర్రీ కలిసి నటించిన ఆచార్య సినిమా ప్లాప్ కావడంతో తర్వాతి సినిమాను హై రేంజ్ లో ప్లాన్ చేశాడు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ అనే సినిమాను రామ్ చరణ్ చేస్తున్న విషయం తెలిసిందే.

అంతేకాకుండా రామ్ చరణ్ ఓవైపు హీరోగా నటిస్తూనే తన ప్రొడక్షన్స్ హౌజ్ లో సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉంటే జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ram charan telangana formation day

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా గేమ్ చేంజర్. టాలీవుడ్ లోని అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు 50వ చిత్రంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ రెండోసారి రామ్ చరణ్ తో జత కడుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయగా మరొక హీరోయిన్ గా అంజలి నటిస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

గేమ్ చేంజర్ మూవీనే కాకుండా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఇలా హీరోగా సినిమాలు మాత్రమే కాకుండా కొణిదెల ప్రొడక్షన్స్, వి మెగా పిక్చర్స్ బ్యానర్లపై సినిమాలు సైతం నిర్మిస్తున్నాడు చెర్రీ. ఇటీవలే నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా ది ఇండియా హౌజ్ మూవీని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా అన్ని రంగాల్లో రాణిస్తున్న రామ్ చరణ్ సామాజిక అంశాలపై కూడా స్పందిస్తున్నారు. తాజాగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ram charan telangana formation day

జూన్ 2, 2023తో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశాడు రామ్ చరణ్. "తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు అవుతుంది. ఈ పదేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, బంగారు తెలంగాణ కల నిజం చేసుకుంటున్నాం. తెలంగాణ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ అక్కా చెల్లెల్లు, అన్నాదమ్ముల్లకు అందరికీ నా శుభాకాంక్షలు" అని చెర్రీ రాసుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X