twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి, వెంకటేష్‌లలో అదే కామన్ పాయింట్.. రామ్ చరణ్ కామెంట్స్

    |

    బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన 'దబాంగ్ 3' సినిమా హిందీతో పాటు తెలుగులో కూడా విడుదల కానుంది. క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్స్‌‌తో బిజీగా ఉంది. ఇందులో భాగంగా బుధవారం రోజు (డిసెంబర్ 18) హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను భారీ ఎత్తున నిర్వహించారు. ఆ వివరాలు చూస్తే..

    కండల వీరుడికి ఘన స్వాగతం.. బాలీవుడ్, టాలీవుడ్ తారల సందడి

    కండల వీరుడికి ఘన స్వాగతం.. బాలీవుడ్, టాలీవుడ్ తారల సందడి

    హైదరాబాద్‌లో జరిగిన ఈ ప్రీ రిలీజ్ వేడుకకు హీరో సల్మాన్ ఖాన్ సహా సోనాక్షిసిన్హా, కిచ్చాసుదీప్, ప్రభుదేవా తదితరులు హాజరయ్యారు. వీరికి ఘన స్వాగతం పలికారు తెలుగు ప్రేక్షకులు. పలువురు బాలీవుడ్, టాలీవుడ్ తారల సందడితో ‘దబాంగ్ 3' ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది.

    చిరంజీవి గురించి సల్మాన్ కామెంట్స్

    చిరంజీవి గురించి సల్మాన్ కామెంట్స్

    ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్‌ హాజరయ్యారు. ఈ సందర్బంగా వేదికపై మాట్లాడిన సల్మాన్ ఖాన్.. తెలుగు వారితో తనకు ప్రత్యేక అనుబంధముందని అన్నారు. హైదరాబాద్ రావడం చాలా ఆనందంగా ఉందని తెలుపుతూ చిరంజీవి తనకు అత్యంత ఆప్తులని చెప్పారు.

    వెంకీమామపై సల్మాన్..

    వెంకీమామపై సల్మాన్..

    ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన వెంకీమామ తన చిరకాల మిత్రుడని సల్మాన్ చెప్పారు. 25 ఏళ్ల నుంచి తామిద్దరం మంచి స్నేహితులమని అన్నారు. ''దబాంగ్ 3 సినిమా హిందీతోపాటు తెలుగులో కూడా విడుదలవుతుంది. చుల్‌బుల్ పాండే, రజ్జో పాత్రలు తెలుగు ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తాయి. ఈ సినిమాను తప్పకుండా ఆదరిస్తారని కోరుతున్నా'' అని సల్మాన్ అన్నారు.

    సల్మాన్ నుంచి చాలా నేర్చుకున్నా: రామ్ చరణ్

    సల్మాన్ నుంచి చాలా నేర్చుకున్నా: రామ్ చరణ్

    రామ్ చరణ్ మాట్లాడుతూ.. ''సల్మాన్ ఖాన్ పైన నాకున్న ప్రేమను చెప్పడానికి ఈ ఒక్క ఈవెంట్ సరిపోదు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నా. సూపర్ స్టార్స్ అంటే సల్మాన్ ఖాన్, చిరంజీవి, వెంకటేష్, సుదీప్ మాదిరే ఉంటారు. వీళ్లందరో కామన్ పాయింట్ ఒక్కటే. అదే క్రమశిక్షణ. నెక్స్ట్ జనరేషన్‌కి వీళ్లే స్పూర్తి. ఈ చిత్ర దర్శకుడు ప్రభుదేవా సార్‌ని చిన్నప్పటి నుండి చూస్తున్నా.. ఆయన మల్టీటాలెంట్. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా'' అన్నారు.

    వెంకటేష్, రామ్ చరణ్‌లతో సల్మాన్ స్టెప్పులు

    వెంకటేష్, రామ్ చరణ్‌లతో సల్మాన్ స్టెప్పులు

    చివరగా ఈ వేడుకలో స్టేజ్‌పై సల్మాన్ ఖాన్ అదిరిపోయే స్టెప్పులేశారు. వెంకటేష్, రామ్ చరణ్‌లతో కలిసి స్టెప్పులు వేస్తూ అభిమానుల్లో జోష్ తీసుకొచ్చారు సల్మాన్.
    ఇలా ఈ ముగ్గురు స్టార్ల డాన్సులు చూసి ఫిదా అయ్యారు తెలుగు ప్రేక్షకులు.

    English summary
    Ram Charan and Venkatesh attended as cheif guests for Dabangg 3 pre release event. In this event Ram Charan commented Venkatesh and Chiranjeevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X