RRRలో కనిపించబోయే హైలెట్ ఆయుధం అదే.. రాజమౌళి కెరీర్ లోనే ఇది బెస్ట్ వెపన్..
దర్శక ధీరుడు రాజమౌళి సినిమా వస్తుంది అంటే మాస్ ప్రేక్షకులలో అయితే ఒక ప్రత్యేకమైన అంచనాలు ముందే క్రియేట్ అవుతుంటాయి. తప్పకుండా సినిమాలో ఏదో ఒక ఎలివేషన్ లో రాజమౌళి ప్రత్యేకమైన ఆయుధాలను కూడా హైలెట్ చేస్తూ ఉంటాడు. రెండవ సినిమా సింహాద్రి నుంచి కూడా ప్రతి సినిమాలో ఏదో ఒక యూనిక్ ఆయుధమైతే మేజర్ హైలెట్ గా నిలుస్తోంది. ఇక ఇప్పుడు రాబోయే RRR సినిమాలో అలాంటి ఆయుధాలు ఏమైనా ఉంటాయా అనే సందేహాలు రాకుండా ఉండవు. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో అదే ప్రశ్నపై హీరో రామ్ చరణ్ తేజ్ ఎవరూ ఊహించని విధంగా ఒక అద్భుతమైన సమాధానం ఇచ్చాడు.

ఆ సినిమా నుంచే..
రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ అంతగా మాస్ సినిమా కాకపోయినా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన సింహాద్రి సినిమా మాత్రం ఫ్యాన్స్ కు ఒక ప్రత్యేకమైన స్పెషల్ ట్రీట్ అనే చెప్పాలి. అందులో సింహాద్రి వాడిన గొడ్డలి కూడా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రేజ్ అయితే అందుకుంది. ఇక రాజమౌళి ఆయుధాల ట్రెండ్ అప్పటి నుంచే వేగాన్ని పుంజుకుంది ఆ తరువాత సై సినిమా లో కూడా నితిన్ తో చేతిలో పట్టుకుని ఒక ప్రత్యేకమైన ఆయుధం కూడా అప్పట్లో హైలెట్గా నిలిచింది. ఇక ఆ తర్వాత వచ్చిన చత్రపతి గొడ్డలి అలాగే విక్రమార్కుడు ఆయుధం కూడా మాస్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది అనే చెప్పాలి.

ఈగకు కూడా..
వీలైనంత వరకూ ప్రతి సినిమాలో కూడా రాజమౌళి ప్రత్యేకమైన ఆయుధాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. మర్యాద రామన్న లో పెద్దగా ఆయుధాలు లేకపోయినా కూడా సైకిల్ అయితే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దానికి రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా హైలెట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆఖరికి ఈగ సినిమాకు కూడా గుండు సూది ఆయుధాన్ని సెట్ చేసి తన ట్రెండ్ ను కొనసాగించాడు.

బాహుబలిలో కూడా
ఇక బాహుబలి సినిమా లో అయితే చాలా రకాల ఆయుధాలను వాడడం జరిగింది. అన్నిటికీ కూడా మంచి క్రేజ్ తగ్గింది. రాజమౌళి సాధారణంగా ఆయుధాలను పెట్టాలని పెట్టకుండా ఎమోషన్ కు తగ్గట్టుగా ఎంత అవసరమో అదే తరహాలో ఆలోచించి ఆయుధాలను వాడుతూ ఉంటారు.

మరి RRRలో ఎలాంటి ఆయుధాల ఉంటాయి?
ఇక ఎన్నో అంచనాలతో వచ్చిన RRR సినిమాలో ఎలాంటి ఆయుధాన్ని వాడుతున్నారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ట్రైలర్ చూసిన దాన్నిబట్టి రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు సాధారణంగా బాణాలతో విలన్స్ ను కొడతాడు అని తెలుస్తోంది. ఇక కొమరం భీమ్ గా నటించిన జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి ఆయుధం సెట్ చేసారు అనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

సినిమా ఉండే ఆయుధం ఇదే!
రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ తేజ్ RRR సినిమా లో ఉండే ప్రధాన ఆయుధం గురించి ఒక మంచి క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో ఎమోషన్ అనేది మెయిన్ వెపన్ అంటూ సినిమాలో ఉండే ప్రతి క్యారెక్టర్ కు ఒక ఎమోషన్ తోని ట్రావెల్ అవుతుంది అని.. అంతకంటే సినిమాలో బెస్ట్ ఆయుధం మరొకటి ఉండదని కూడా చెప్పుకొచ్చారు. అంటే ఒక పాయింట్ ను హైలెట్ చేస్తూ రాజమౌళి ఆయుధం లాగా దాన్ని మార్చినట్లు చరణ్ చెప్పాడు. మరి ఆ ఎమోషనల్ ఆయుధం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











