twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భక్త ‘రామ్ చరణ్’తెలుసుకున్న సత్యాలు..

    By Pratap
    |

    Ram Charan Tej
    మన మోడ్రన్ చెర్రీ..అదేనండీ చిరు తనయుడు రామ్ చరణ్. మనోడు అయ్యప్ప దీక్ష తీసుకున్న తర్వాత చాలా సత్యాలు తెలుసుకున్నాడట. ఇటీవల శబరిమల యాత్ర ముగించుకుని వచ్చిన అనంతరం తన మనసులోని మాటలు బయట పెట్టాడు. అవేమిటో ఆయన మాటల్లోనే...

    ''శబరిమల యాత్ర గొప్పగా ఉంది. నా సన్నిహిత మిత్రులిద్దరితో వెళ్లాను. కొండెక్కి యాత్ర పూర్తి చేశాను. ఆనందాన్ని పరిపూర్ణ భావనను పొందాను, రచ్చ షూటింగ్ సందర్భంగా దాదాపుగా చావు దగ్గర వరకు వళ్లి బయట పడ్డాను. తాడు తెగి పోవడంతో రైలు పట్టాలపై పడి పోయాను. ఆ సమయంలో అయ్యప్ప దీక్షలో ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేక పోతే నా పరిస్థితి ఏమయ్యేదో..? ఏది ఏమైనా అయ్యప్ప స్వామికి నా థాంక్స్. మాల ధారణ నా జీవితాన్నే మార్చేసింది. నేను అప్పయ్య దీక్ష చేపట్టడం ఇది ఏడో సారి. సాధారణ జీవితం గడపడం దీని వల్ల నేను నేర్చుకున్నాను. ఆడంబరాలు జీవితానికి ముఖ్యం కావని తెలుసుకున్నాను. అప్పయ్య దీక్ష నన్ను నెమ్మదిగా మార్చింది. నా పరిశీలనను, ఏకాగ్రతను మెరుగు పరిచింది. యువకులు, వ్యాపార వేత్తలు కూడా ఈ దీక్ష తీసుకుంటే మంచి ఫలితాలు సాధిస్తారనేది నా అభిప్రాయం"" అంటూ చెప్పుకొచ్చాడు.

    'ఆరెంజ్‌" చిత్రం నిరాశపరిచిన నేపథ్యంలో తాజాగా నటిస్తున్న 'రచ్చ"తో భారీ విజయాన్ని నమోదు చేసుకోవాలన్న కసితో రామ్‌ చరణ్‌ ముందుకు సాగుతున్నాడు. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. సంపత్‌ నంది దర్శకుడు. ఆర్‌బి చౌదరి సమర్పణలో మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ పతాకంపై యన్‌వి ప్రసాద్‌, పారాస్‌ జైన్‌ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

    English summary
    Ram Charan share his experience in Sabarimala tour.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X