పోటీ సినిమా SVSCపై రామ్ చరణ్ కామెంట్స్
హైదరాబాద్ : ఈ సంక్రాంతి బరిలో రెండే రెండు పెద్ద సినిమాలు ఢీ అంటే ఢీ అంటూ రంగంలోకి దూకాయి. రాష్ట్రంలోని థియేటర్లన్నీ దాదాపుగా ఈ రెండు సినిమాలే ఆక్రమించాయి. అందులో మొదటిది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'నాయక్' చిత్రం కాగా, మరొకటి సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ నటించిన మల్టీ స్టారర్ మూవీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'.
సాధారంగా....ఇలా రెండు సినిమాలు పోటా పోటీగా ఉన్నప్పుడు ఆయా సినిమాల హీరోలు ప్రత్యర్థి సినిమాలపై పెద్దగా కామెంట్స్ చేయడానికి ఇష్ట పడరు. ఎందుకంటే వారి కామెంట్స్ నెగెటివ్ అయినా...పాజిటివ్ అయినా ఏదో సమస్య తలెత్తుతుందనే కారణంతో ఏ కామెంట్స్ చేయకుండా మౌనం వహిస్తుంటారు.
అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం అందుకు భిన్నంగా తన పోటీ సినిమా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంపై కామెంట్స్ చేసారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్‌ను మల్టీ స్టారర్ సినిమా గురించి ప్రశ్నించగా...మల్టీ స్టారర్ సినిమాలపై ఇంట్రస్టు చూపుతున్నట్లే చూపి...దానికి సరైన కథ కావాలి, అందుకోసం వెయిట్ చేయడం నా వల్ల కాదు, కథ, అందులో తన పాత్ర నచ్చే విధంగా ఉంటే భవిష్యత్ లో ఆలోచిస్తాననే విధంగా సమాధానం ఇచ్చారు. ఆశ్యర్యంగా అదే సమయంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ప్రస్తావన తెచ్చారు చెర్రీ.
'SVSC కథ, స్ర్కిప్టు తమకు సరిపోయేది, పర్ ఫెక్ట్ అని భావించారు కాబట్టే మహేష్ బాబు, వెంకటేష్ చేస్తున్నారు, ఒకే సినిమాలో కలిసి నటించాలనే ఒక కారణం మాత్రమే కాక పోవచ్చు' అని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా తనకు సరిపోయే పర్ ఫెక్ట్ స్ర్కిప్టు దొరికితే తప్పకుండా చేస్తాను అని చెప్పకనే చెప్పాడు మెగా పవర్ స్టార్.


Click it and Unblock the Notifications











