‘సైరా’కు ఏడాది.. ఓ గొప్ప అనుభవం అంటూ రామ్ చరణ్ ట్వీట్

తొలి స్వతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సైరా చిత్రం తెలుగు నాట సంచలనాన్ని నమోదు చేసింది. ప్యాన్ ఇండియన్ మూవీగా నిర్మించిన ఈ మూవీ టాలీవుడ్‌లో దుమ్ములేపింది. అత్యంత భారీ ఎత్తున, ఇండియన్ సెలెబ్రిటీలందరినీ ఒకే చోటకు తీసుకొచ్చిందీ సైరా. రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల సునామిని సృష్టించింది.

సైరా చిత్రం విడుదలై నేటికి ఏడాది అవుతోంది. చిరంజీవి, అమితాబ్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, నయనతార, తమన్నా, జగపతి బాబు వంటి వారెంతో మంది అద్భుతంగా నటించి సినిమా విజయంలో కీలకపాత్ర పోషించారు. సినిమాలోని ప్రతీ ఫ్రేమ్ అద్భుతంగా రావడం వెనుక రత్నవేలు కృషి దాగి ఉంది. రోమాలు నిక్కబొడుచుకునేలా సంగీతాన్ని, నేపథ్య సంగీతాన్ని అందించిన అమిత్ ద్వివేది విజయం దాగి ఉంది.

 Ram Charan Comments on Sye Raa Completing One Year

తాజాగా చిత్ర నిర్మాత అయిన రామ్ చరణ్ ఓ వీడియోను షేర్ చేశాడు. ఓ గొప్ప అనుభవం, అద్బుతమైన నటీనటులు, బెస్ట్ టీం.. సైరా విడదులై నేటికి ఏడాది అవుతోంది. ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అని తెలిపాడు. ప్రస్తుతం రామ్ చరణ్ షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ వరుసగా చిత్రాలను తెరకెక్కిస్తూ భారీ హిట్లు కొట్టేస్తున్నాడు. ఇక ఆచార్య సినిమాతో మరో సారి దుమ్ములేపేందుకు రెడీ అవుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X