తెలుగు హీరోలకు ఆ సత్తాలేదంటూ... రామ్ చరణ్ కామెంట్
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో సారి వివాదాస్పద కామెంట్స్ చేసారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరో ఒకరిద్దరికి వర్తించేలా లేవు... మొత్తం తెలుగు సినీ ఇండస్ట్రీని ఉద్దేశించి ఉండటంతో రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు వంద శాతం సరైనవే అని కొందరు, ఎవరో కొందరు చేసే పనులను మొత్తం ఇండస్ట్రీకి వర్తింప చేయడం సరికాదని మరికొందరు అంటున్నారు.
ఇంతకీ రామ్ చరణ్ ఏమన్నారంటే....
'టాలీవుడ్లో దాదాపు అందరు హీరోలు తమ సినిమాలను అనుకున్న సమయానికి షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయడం లేదు. ఏదో ఒక కారణంతో సినిమాలు సంవత్సరాలు కొద్దీ వాయిదా పడుతూనే ఉన్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ల మాదిరి మనం వసరుగా సినిమాలు డెలివరీ చేయలేక పోతున్నాం. బాలీవుడ్లో ఉన్నంత డిసిప్లేన్ టాలీవుడ్లో లేదు' అంటూ కామెంట్ చేసాడు చరణ్. రామ్ చరణ్ కామెంట్ పై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇతర వివరాల్లోకి వెళితే...
ప్రస్తుతం రామ్ చరణ్ బాలీవుడ్ ప్రాజెక్టు 'జంజీర్'తో పాటు, టాలీవుడ్ ప్రాజెక్ట్ 'ఎవడు'లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. 'జంజీర్' చిత్రం వేసవిలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల చేయనున్నారు. అదే విధంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న మరో చిత్రం 'ఎవడు' చిత్రం కూడా త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.
వీటి తర్వాత చెర్రీ నటించబోయే మరో మూడు ప్రాజెక్టులు ఓకే అయ్యాయి. అందులో ఒకటి మిర్చి దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో, మరొకటి త్రివిక్రమ్ దర్శకత్వంలో, మరొకటి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉండనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రాన్ని గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించనున్నారు. అదే విధంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంపై కూడా మంచి అంచనాలున్నాయి.


Click it and Unblock the Notifications











