»   » రామ్ చరణ్ సినిమా ఆగిపోయినట్టేనా..? కారణాలేమిటి?

రామ్ చరణ్ సినిమా ఆగిపోయినట్టేనా..? కారణాలేమిటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఓ క్లాస్ సినిమా చేసి, ఎ క్లాస్ సెంటర్ల ఆడియన్స్ కు, ఓవర్ సీస్ మార్కెట్ కు చేరువ కావాలని హీరో రామ్ చరణ్ డిసైడ్ అయ్యాడు. అందుకే మణిరత్నం డైరకక్షన్ లో ఓ సినిమా చేయాలనుకున్నాడు కూడా. ఇప్పుదు సుకుమార్ తో చేస్తున్న సినిమా పూర్తి కాగానే ఆ సినిమా మొదలవబోతోందంటూ వార్తలు వచ్చాయి. మరోవైపు ఇదే సినిమాతో చెర్రీ, మరోసారి బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టే ఆలోచనలో ఉన్నాడని కూడా అనుకున్నారు.

జంజీర్ సినిమాతో భారీ ఫ్లాప్ తెచ్చుకున్న చరణ్... మరోసారి బాలీవుడ్ గురించి ఆలోచించలేదు. అయితే మణిరత్నం సినిమాలకు హిందీలో కూడా ఫాలోయింగ్ బాగా ఉండడంతో.. కుదిరితే తెలుగు-తమిళ-హిందీ భాషల్లో ఈ సినిమాను ఒకేసారి తెరకెక్కించే ఆలోచన కూడా చేసారు. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా రావటం అనుమానమే....

Ram Charan confused for Mani Ratnam Movie After Cheliya Movie Result?

అయితే మణిరత్నం దర్శకత్వంలో ఇటీవల విడుదలైన చెలియాకు డిజాస్టర్ టాక్ రావటంతో చెర్రీ ఆలోచనలో పడ్డాడు. దీంతో మణిరత్నం కూడా మనసు మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి చెలియా గనక మినిమం గ్యారెంటీ సినిమాగా నిలిచినా వేరుగా ఉండేది. కానీ దారుణమైన ఫ్లాప్ గా మారటం తో ఇప్పుడు మణిరత్నం తో సినిమా అంత మంచి ఆలోచన కాదేమో అన్న ఆలోచనలో పడ్డాడట చెర్రీ.

English summary
Now the recent release of Mani Ratnam 'Cheliyaa' has once again proved that the director has lost his magic touch.As Cheliyaa turned out as disaster Charan and Chiru are rethinking to promise or sign dates for the film with Mani Ratnam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu