twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రానా కంటతడి, రామ్ చరణ్ ఓదార్పు (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రామానాయుడు మరణంతో ఆయన కుటుంబంతో పాటు యావత్ తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగి పోయింది. రామానాయుడు భౌతిక కాయాన్ని చూసేందుకు వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా అభిమానులు తరలి వస్తున్నారు. అభిమానుల తాకిడితో రామానాయుడు స్టూడియో కిక్కిరిసి పోయింది.

    కాగా...తాతయ్య మరణ వార్త విన్న వెంటనే ఆయన మనవడు, హీరో రానా ఎమోషన్ అయ్యారు. తాతయ్య ఇక లేరనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేక కంట తడి పెడుతున్న రానాను అతని స్నేహితుడైన హరో రామ్ చరణ్ ఓదార్చారు. అయినా రానా కళ్ల వెంట నీళ్లు ఆగ లేదు. తన కళ్లలో నీళ్లు ఇంకిపోయేంతగా రానా ఏడ్చారు. ఈ సంఘటన అందరినీ కలిచి వేసింది.

    ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు...

    రానా, రామ్ చరణ్

    రానా, రామ్ చరణ్


    తాతయ్య లేని బాధతో కంటపతడి పెడుతున్న రానాను ఓదార్చుతున్న రామ్ చరణ్.

    అనారోగ్యంతో...

    అనారోగ్యంతో...


    శతాధిక చిత్రాల నిర్మాత... మూవీ మొఘల్‌గా పేరుగాంచిన దగ్గుబాటి రామానాయుడు (79) అనారోగ్యంతో కన్నుమూశారు.

    క్యాన్సర్ మహమ్మారి

    క్యాన్సర్ మహమ్మారి


    కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నం 2.30గంటలకు హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాసవిడిచారు.

    అంత్యక్రియలు

    అంత్యక్రియలు


    అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 3 తర్వాత రామానాయుడు స్టూడియోలో నిర్వహించనున్నారు.

    అధికారిక లాంఛనాలు

    అధికారిక లాంఛనాలు


    అధికారిక లాంఛనాలతో రామానాయుడు పార్థీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

    English summary
    Ram Charan consolation to Rana. Legendary film producer Daggubati Ramanaidu (79) passed away in Hyderabad on Wednesday after fighting prostate cancer. Father of noted film hero, D. Venkatesh and grandfather of upcoming actor, Rana, Ramanaidu established the well-known film house Suresh Productions, named after his elder son.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X