అల్లు అర్జున్ కి రామ్ చరణ్ కౌంటర్?
తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర ఉన్నటువంటి బిగెస్ట్ ఫ్యామిలీస్ లో మెగా కుటుంబం కూడా ఒకటి. ఎన్ని చిన్న చిన్న పొరపథ్యాలు ఉన్నప్పటికీ నేటి తరణకి కూడా కుటుంబం అంటే వీరిలా కలిసి ఉండాలి అన్నట్టుగా దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవి అందరినీ కలిపి ఉంచుతూ పెద్దన్న పాత్రకి పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలిచారు. కాగా ఒకప్పుడు మెగా హీరోలు అంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా రామ్ చరణ్, అల్లు అర్జున్ సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా అంతా మెగా హీరోలు గానే వచ్చారు. ఇండస్ట్రీలో కొనసాగారు.
కాగా ఇప్పుడు పరిస్థితులు చాలా భిన్నంగా మాదిరిపోయాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ విషయంలో చాలా రచ్చ ఇప్పుడు నడుస్తుంది. ఏపీలో జరిగినటువంటి రీసెంట్ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ చేసిన పని మెగా అభిమానుల్లో పెద్ద చిచ్చు తెచ్చి పెట్టింది. దీనితో ఫ్రెండ్ కోసం కుటుంబాన్ని పక్కన పెట్టడం ఏంటని ఎప్పటికైనా ఎవరైనా కూడా కుటుంబపు విలువలు మర్చిపోకూడదు కానీ దానిని అల్లు అర్జున్ ఒక స్టేజికి వచ్చాక మర్చిపోయాడు అంటూ చాలానే కామెంట్స్ ఇపుడు తన విషయంలో వినిపిస్తున్నాయి.

అయితే అసలు మెగా హీరోస్ విషయంలో అల్లు అర్జున్ కి సమానమైన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని చెప్పాలి. పాన్ ఇండియా వరకు ఏమో కానీ గ్లోబల్ గా ఐతే చరణ్ కి మరింత ఫేమ్ ఉంది. అయినా కూడా చరణ్ ఎంతో సౌమ్యంగా ఉంటాడు అని అభిమానులు అంటారు. కాగా ఇప్పుడు చరణ్ అల్లు అర్జున్ కి గట్టి కౌంటర్ ఇచ్చాడు అంటూ కొన్ని కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.
రీసెంట్ గా అల్లు అర్జున్ ఒక ఈవెంట్ లో నా మనసుకి నచ్చింది చేస్తాను అది ఫ్రెండ్ కోసం అయినా ఇంకెవరి కోసం అయినా అంటూ కూడా మరోసారి చాలా మందిని ట్రిగ్గర్ చేసాడు. దీనితో చల్లారింది అనుకున్న కాంట్రవర్సీ మళ్లీ రేగింది. అయితే దీనికి కౌంటర్ గా అన్నట్టు తమ కుటుంబం కోసం చరణ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. జస్ట్ ఈ కొన్ని రోజుల్లోనే చరణ్ ఓ ఈవెంట్ లో హాజరు కాగా అందులో ఏమన్నాడంటే..
ఎంత కాదన్నా అవున్నన్నా మేము ఒకటే రక్తానికి చెందిన వాళ్ళం. మా నుంచి దాన్ని ఎవరూ వేరు చేయలేరు, అది చాలా కష్టం అంటూ కామెంట్స్ చేసాడు. మా బాబాయ్, నాన్న గారి విషయంలో ఇది బాగా కనిపిస్తుంది. అంటూ తెలిపాడు. దీనితో ఈ మెగా అభిమానుల్లో వైరల్ గా మారింది. కుటుంబ విలువలు ఎప్పుడూ మర్చిపోకూడదు అంటూ మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు కానీ..

చరణ్ ఎలాగైతే తమ కొణిదెల కుటుంబం కలిసి ఉండాలి అనుకుంటున్నాడో అలాగే అల్లు అర్జున్ కూడా ఇన్నాళ్లు తన మీద ఉన్న మెగా స్టాంప్ పక్కన పెట్టి తమ అల్లు ఫ్యామిలీకి గుర్తింపు ఉండాలని చేస్తున్నాడు అనుకోవచ్చుగా అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఇపుడు మళ్ళీ అల్లు అర్జున్, మెగా హీరోల అభిమానుల నడుమ వాగ్వాదం సోషల్ మీడియాలో ఎక్కువగానే ఉంటుంది. మరి దీనికి ఒక ఓజిటివ్ ఎండింగ్ ఉంటుందో లేదా నెగిటివ్ ఎండింగ్ ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











