మీ నుంచి నేను కోరుకునే బహుమతి అదే.. రామ్ చరణ్ పవర్‌ఫుల్ రియాక్షన్

నేడు (మార్చి 27) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు బర్త్‌ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సెలబ్రిటీలు మొదలుకొని ప్రేక్షక లోకం వరకూ అంతా సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రామ్ చరణ్ రియాక్ట్ అవుతూ ట్వీట్ చేశారు.

''గత రాత్రి నుంచే నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతలా అభిమానం చూపిస్తూ మీరంతా పోస్ట్ చేస్తున్న హృదయపూర్వక శుభాకాంక్షలు ఆశ్చర్యపోతున్నాను. కాకపోతే ఈ సమయంలో మీ అందరి నుండి నేను కోరుకునే బహుమతి ఒక్కటే. లాక్‌డౌన్ పూర్తయ్యే వరకూ దయచేసి ఇంట్లోనే ఉండండి. అదే మీరంతా నాకిచ్చే ఉత్తమమైన బహుమతి'' అని పేర్కొన్నారు రామ్ చరణ్.

 Ram Charan Crazy reaction on Birth Day wishes

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్థిస్తూ రామ్ చరణ్ చేసిన ఈ ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ''మీరు కోరినట్లుగానే నేనంటే నేను ఆ బహుమతి ఇస్తున్నా'' అంటూ రామ్ చరణ్‌ ట్వీట్‌పై స్పందిస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికే కరోనా సహాయక చర్యల్లో భాగమవుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల ముఖ్యమంత్రుల సహాయనిధికి రామ్ చరణ్ 70 లక్షల రూపాయల ఆర్థికసాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X