ఎన్టీఆర్ టచ్ చేశాడు.. రాంచరణ్ కొట్టేశాడు.. ఆకట్టుకున్న దృశ్యం!

Recommended Video

Ram Charan Did It On Behalf NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శత్వంలో నటించేందుకు రంగం సిద్ధం అయింది. ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమా చరిత్రలోనే అతిపెద్ద మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కబోతోంది. ఇటీవల ఈ చిత్రం ప్రారంభోత్సవం జరిగితేనే జాతీయ మీడియాలో చర్చించుకుంది. ఇప్పటికే దేశంలోని సినీ అభిమానులంతా ఆర్ఆర్ఆర్ విశేషాలు తెలుసుకునేందుకు ఆసక్తికి చూపుతున్నారు. బాహుబలి చిత్రంతో జక్కన్న చూపిన ప్రభావం అంది. ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ పూజ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. దీని గురించి అటు మెగా ఫాన్స్, ఇటు ఎన్టీఆర్ ఫాన్స్ చర్చించుకుంటున్నారు.

దూరంగా ఉండిపోయిన ఎన్టీఆర్

దూరంగా ఉండిపోయిన ఎన్టీఆర్

ఆర్ఆర్ఆర్ లాంచ్ కు విచ్చేసిన అతిథులు, చిత్ర యూనిట్ అందరూ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ కొబ్బరికాయ కొట్టి దేవుడి ఆశీస్సులు అందుకున్నారు. ఎన్టీఆర్ మాత్రం కొబ్బరికాయ కొట్టకుండా దూరంగా ఉండిపోయాడు. దానికి కారణం.. ఇటీవల తన తండ్రి హరికృష్ణ మరణించడంతో ఎన్టీఆర్ కొబ్బరికాయ కొట్టలేదు.

చొరవ తీసుకున్న రాంచరణ్

చొరవ తీసుకున్న రాంచరణ్

ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ ఈ చిత్రంలో హీరోలు. చరణ్ కొబ్బరికాయ కొట్టే సమయంలో ఎన్టీఆర్ ని కూడా ఇన్వాల్వ్ చేయాలని చొరవతీసుకున్నాడు. దూరంగా నిలుచుని ఉన్న ఎన్టీఆర్ వద్దకు కొబ్బరికాయ తీసుకునివెళ్ళి ఒకసారి దీనిని టచ్ చేయమని అడిగాడు. మొదట దీనికి ఎన్టీఆర్ నిరాకరించినట్లు తల ఊపాడు. పూజారి కూడా సమ్మతించడంతో కొబ్బరికాయని ఎన్టీఆర్ టచ్ చేశాడు. ఎన్టీఆర్ తాకిన ఆ కొబ్బరి కాయని రాంచరణ్ దేవుడిముందు కొట్టి పూజ పూర్తి చేశాడు.

ఇద్దరికీ ఆ అనుభవం

ఇద్దరికీ ఆ అనుభవం

ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి మాట్లాడుకుంటే.. రాజమౌళి చాలా సౌకర్యంగా భావించే నటులు రాంచరణ్, ఎన్టీఆర్. వీరిద్దరిని రాజమౌళి గతంలో డైరెక్ట్ చేసి ఉన్నాడు. మగధీర చిత్రంలో రాంచరణ్.. స్టూడెంట్ నెం 1, సింహాద్రి, యమదొంగ చిత్రాలలో ఎన్టీఆర్ రాజమౌళి దర్శత్వంలో నటించారు. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్, ఎన్టీఆర్ ని రాజమౌళి అద్భుతంగా చూపిస్తాడు అని చెప్పడంలో సందేహం లేదు.

హీరోయిన్లు ఇంకా

హీరోయిన్లు ఇంకా

ఈ చిత్రంలో చరణ్, ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్లని ఇంకా ఎంపిక చేయవలసి ఉంది. హీరోయిన్లు ఎవరు, విలన్ ఎవరు తదితర విషయాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. బాహుబలిలో రానాని విలన్ గా చూపించిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ కోసం ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడో చూడాలి. 1920 కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X