'బిగ్ బాస్' గా మా నాన్న నచ్చలేదు: రామ్ చరణ్
రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి గురించి మాట్లాడుతూ...నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతూంటాను ఆయన ఎనర్జీ, డైనమిజం చూసి..దాదాపు సినిమా ఫీల్డు కొచ్చి పాతికేళ్ళు దాటినా, మెగాస్టార్ స్టేటస్ వచ్చినా అదే ఎనర్జీతో ఆయన ఉంటారు. నాకు కూడా అలాంటి ఎనర్జీ ఇవ్వమని భగవంతుడుని ప్రార్ధిస్తూంటాను. ఇక నాకు మా నాన్నగారి చిత్రాల్లో ఎక్కువ నచ్చేది విజేత..అయితే అస్సలు నచ్చని చిత్రం బిగ్ బాస్ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రామ్ చరణ్..బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరంజ్ చిత్రంలోనూ, ధరణి దర్సకత్వంలో రూపొందే మెరుపులోనూ చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ చిత్రాన్ని చిరంజీవి హీరోగా విజయబాపినీడు దర్శకత్వంలో రూపొందించారు. శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై నిర్మించారు. బప్పీలహరి సంగీతం అందించిన ఈ చిత్రంలో రోజ, కోట శ్రీనివాసరావు, మాధవి, సుజాత, తణికెళ్ళ భరణి తదితరులు నటించారు. జూన్ 15 1995న రిలీజైంది.


Click it and Unblock the Notifications











