నా డ్రీమ్ డైరక్టర్ ఆయనే: రామ్ చరణ్
రామ్ చరణ్ తన మనస్సులో మాటలను బయిటపెట్టి తాను ఎప్పటికైనా ఏ దర్శకుడుతో చేయాలనుకుంటున్నాడో చెప్పుకొచ్చారు. ఆయనెవరో కాదు రాజు హిర్వాణి. మున్నాభాయ్ ఎమ్.బి.బిస్,లగేరహోమున్నాభాయ్, త్రీ ఇడియిట్స్ చిత్రాలు చేసిన ఆ దర్శకుడుతో హిందీలో సినిమా చేయాలని ఉందని అన్నారు. అంతేగాదు ఆయన్ని తాను ముంబైలో కలిసి తన కోరిక చెప్పానని అన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ దాదాపు ఎనిమిది కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ట్రేడ్ లో వినపడుతోంది.రామ్ చరణ్ ప్రస్తుతం రచ్చ చిత్రం చేస్తున్నాడు.
పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ'సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది. అలాగే అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి మనుమరాలు కామినేని ఉపాసనిని వివాహ విషయమై తరుచుగా వార్తల్లో ఉంటున్నారు.


Click it and Unblock the Notifications











