50 కోట్ల రెమ్యూనరేషన్....రామ్ చరణ్‌‌కు అంత సీన్ లేదు!

By Bojja Kumar

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్లో పాగా వేద్దామని చేసిన తొలి ప్రయత్నం 'జంజీర్' అట్టర్ ప్లాన్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర ఫలితాలతో రామ్ చరణ్ మైండ్ సెట్ పూర్తిగా మారి పోయింది. బాలీవుడ్లో ప్రయోగాలతో చేతులు కాల్చుకోవడం కంటే తెలుగులో మినిమం గ్యారంటీ కథలను నమ్ముకోవడమే బెటరని డిసైడ్ అయ్యాడు.

అయితే తాజాగా రామ్ చరణ్ గురించి ఓ వార్త సినిమా సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. ఆ మధ్య ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అశుతోష గోవర్కర్ రామ్ చరణ్‌తో ఓ పీరియడ్ డ్రామా సినిమా చేయాలని ప్లాన్ చేసాడు. అయితే ఎందుకనో రామ్ చరణ్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడు.

అదే సినిమాను అశుతోష్ గోవర్కర్....ఇపుడు హృతిక్ రోషన్‌తో ప్లాన్ చేసాడు. ఈ సినిమాకుగాను హృతిక్‌కి ఏకంగా రూ. 50 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసాడట. ఈ సినిమానే ఆయనే నిర్మించబోతున్నారు. అయితే ఏదైనా పెద్ద సినీ నిర్మాణ సంస్థ సహకారం కోసం ఎదురు చూస్తున్నాడు.

రామ్ చరణ్ గురించి అలా...

రామ్ చరణ్ గురించి అలా...

ఈ వార్త బయటకు రావడంతో...రామ్ చరణ్ 50 కోట్ల రెమ్యూనరేషన్ మిస్ అయ్యాడనే ప్రచారం మొదలైంది.

అంత సీన్ ఉందా?

అంత సీన్ ఉందా?

నిజానికి రామ్ చరణ్ అయితే రెమ్యూనరేషన్ అంత ఇచ్చే అవకాశం లేదు. బాలీవుడ్లో హృతిక్ రోషన్ టాప్ రేంజి కాబట్టే రూ. 50 కోట్లు ఆఫర్ చేసారు. చేసిన ఒక్క సినిమా ప్లాపు అయినా రామ్ చరణ్‌కు రూ. 50 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చేంత సీన్ లేదనేది కాదనలేని సత్యం.

గోవిందుడు అందరి వాడేలే

గోవిందుడు అందరి వాడేలే

ఇక రామ్ చరణ్ గురించిన ఇతర విషయాల్లోకి వెళితే....ప్రస్తుతం రామ్ చరరణ్ కృష్ణ వంశీ దర్శకత్వంలో ‘గోవిందుడు అందరి వాడేలే' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. కాజల్ హీరోయిన్. ఫ్యామిలీ ఎంటర్టెనర్‌‌‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

చిరంజీవి 150వ సినిమా

చిరంజీవి 150వ సినిమా

ఇక త్వరలో తెరకెక్కబోయే చిరంజీవి 150వ సినిమాను రామ్ చరణ్ నిర్మించబోతున్నారు. నాన్నకు పర్ ఫెక్టుగా సూటయ్యే కథ తెస్తే రూ. కోటి పారితోషికం ఇవ్వడానికి కూడా తాను సిద్ధమే అని అంటున్నాడు చరణ్. 150వ సినిమాను పెద్ద హిట్ చేసి డాడీకి గిఫ్టుగా ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రానికి రామ్ చరణ్ మదర్ సురేఖ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X