బరి నుండి తప్పుకున్న రామ్ చరణ్!

By Bojja Kumar

హైదరాబాద్: బాక్సాఫీసు వద్ద టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పోటీ పడటం ఈ మధ్య తరచూ జరుగుతున్న సంగతి తెలిసిందే. గతేడాది మహేష్ బాబు నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', రామ్ చరణ్ నటించిన 'నాయక్' చిత్రాలు పోటా పోటీగా విడుదలయ్యాయి. రెండు చిత్రాలు హిట్టయ్యాయి.

ఈ ఏడాది మహేష్ బాబు నటించి '1-నేనొక్కడినే' చిత్రం, రామ్ చరణ్ నటించిన 'ఎవడు' చిత్రాలు పోటా పోటీగా విడుదలయ్యాయి. అయితే ఈ సారి విజయం కేవలం రామ్ చరణ్‌ను మాత్రమే వరించింది. మహేష్ '1-నేనొక్కడినే' చిత్రం ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.

Ram Charan dropped out

మరోసారి ఈ ఇద్దరూ బాక్సాఫీసు వద్ద పోటీ పడటానికి సిద్ధమవుతున్నారంటూ ఈ మధ్య వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దసరా సీజన్ పురస్కరించుకుని రామ్ చరణ్ నటిస్తున్న 'గోవిందుడు అందరివాడేలే', మహేష్ బాబు నటిస్తున్న 'ఆగడు' చిత్రాలు (సెప్టెంబర్ 26) విడుదలకు సిద్ధమయ్యాయి.

అయితే ఉన్నట్టుండి రామ్ చరణ్ సినిమా బరి నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. పలు కారణాలతో రామ్ చరణ్ నటిస్తున్న 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రం షూటింగ్ ఆగిపోడంతో....దసరాకి విడుదలయ్యే అవకాశం లేదని అంటున్నారు. ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. మహేష్ నటిస్తున్న 'ఆగడు' చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తుండగా, 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్ నిర్మిస్తోంది. తమన్నా హీరోయిన్. యాక్షన్ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X