twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'వినయ విధేయ రామ' ప్లాప్‌పై రాంచరణ్..బోయపాటి మాటెత్తకుండా, ఫ్యాన్స్‌కు ఎమోషనల్ లెటర్!

    |

    మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన తాజా చిత్రం వినయ విధేయ రామ. బోయపాటి దర్శత్వంలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రంగస్థలం చిత్రం తర్వాత రాంచరణ్ నుంచి వచ్చిన భారీ చిత్రం కావడంతో అభిమానులలో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. కానీ వినయ విధేయ రామ చిత్రం అంచనాలని అందుకోలేకపోయింది. ఆరంభ వసూళ్లు అదరగొట్టిన నెగిటివ్ టాక్ ఎక్కువ కావడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేక పోయింది.ఫలితంగా బయ్యర్లకు భారీ నష్టాలు మిగిలాయి. వినయ విధేయ రామ్ చిత్ర పరాజయంపై రాంచరణ్ స్వయంగా స్పందించాడు. అభిమానులకోసం ఓ ఎమోషనల్ లెటర్ విడుదల చేశాడు.

    అభిమానులకు

    అభిమానులకు

    వినయ విధేయ రామ చిత్రం నిరాశ పరచడంతో రాంచరణ్ తాజాగా స్పందించాడు. అభిమానులని ఉద్దేశిస్తూ ఎమోషనల్ లెటర్ రాశాడు. నా పట్ల మా సినిమా పట్ల మీరు చూపించిన ప్రేమ అభిమానులకు ధన్యవాదాలు. ఈ చిత్రం కోసం రేయింబవళ్లు కష్టించి పనిచేసిన సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. నిర్మాత దానయ్యగారు అందించిన సహకారం మాటల్లో చెప్పలేనిది. ఈ చిత్రాన్ని నమ్మి పంపిణి చేసిన డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు రుణపడి ఉంటాను.

    దురదృష్టవశాత్తూ

    దురదృష్టవశాత్తూ

    ఈ చిత్రం మీ అందరికి నచ్చే విధంగా, వినోదాన్ని అందించే విధంగా ఉంటుందని భావించాం. ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని రూపొందించాం. కానీ దురదృష్టవశాత్తూ వినయ విధేయ రామ చిత్రం మీ అంచనాలని అందుకోలేకపోయింది అని రాంచరణ్ అభిమానులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను పూర్తిగా కమర్షియల్ అంశాలతో రూపొందించిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. రాంచరణ్ ఈ లేఖలో బోయపాటి పేరు ప్రస్తావించక పోవడం చర్చనీయాంశం అవుతోంది.

     భవిష్యత్తులో

    భవిష్యత్తులో

    మీరు చూపించే అభిమానం, ప్రేమ తనకు ఉత్తేజాన్ని అందిస్తాయని తెలిపిన చరణ్ భవిష్యత్తులో మంచి చిత్రాలు అందించేందుకు అన్ని విధాలుగా శ్రమిస్తానని తెలిపాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. కియారా గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. స్నేహ, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ కీలక పాత్రల్లో నటించారు. వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో నటించడం విశేషం.

    రాజమౌళి దర్శత్వంలో

    రాజమౌళి దర్శత్వంలో

    ప్రస్తుతం రాంచరణ్ నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ చిత్రానికి కూడా దానయ్యే నిర్మాత. 300 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. రాంచరణ్ బ్రిటిష్ కాలం నాటి పోలీసు పాత్రలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ బందిపోటుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Ram Charan emotional letter to his fans over Vinaya Vidheya Rama result
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X