మీ ప్రాణం కంటే ఏదీ విలువైంది కాదు.. బర్త్ డే వేడుకల్లో అపశ్రుతిపై రామ్ చరణ్
తమ ఆరాధ్య దైవం, అభిమాన హీరో పుట్టిన రోజు అంటే అభిమానులకు పండుగే. అలాంటి పండుగను ఫ్యాన్స్ ఎంత ఘనంగా సెలెబ్రేట్ చేస్తారో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఒక్కోసారి అపశ్రుతులు జరుగుతుంటాయి. ఎక్కువగా క్రౌడ్‌తో ఉండే ఈవెంట్లు చేసినప్పుడు, ఇలా బర్త్ డే వేడుకలకు ఫ్లెక్సీలు కట్టేటప్పుడు ప్రమాదాలు జరిగి అభిమానులు ప్రాణాలను కోల్పోతుంటారు. ఇలాంటి ఘటనలు సదరు హీరోలను ఎంతో దిగ్బ్రాంతికి గురి చేస్తాయి.

రెండు లక్షల విరాళం..
ప్రమాదవశాత్తు చనిపోయిన ఫ్యాన్స్‌కు అండగా వకీల్ సాబ్ టీం నిలిచింది. మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేసింది. అభిమానుల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్టు వకీల్ సాబ్ చిత్రయూనిట్ ఓ ప్రకటన వెలువరించింది.
Recommended Video

విలువైంది ఏదీ లేదు.
నిన్న కుప్పంలో జరిగిన దుర్ఘటనలో ముగ్గురు అభిమానులు కాలం చేశారు అనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. మీ ఆరోగ్యం, మీ ప్రాణంకంటే ఏదీ విలువైనది కాదు. మీరంతా ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని నా మనవి.ఈ దుర్ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ వాళ్ళ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.


Click it and Unblock the Notifications











