అస్సలు ఊహించలేదు.. రాజమౌళి చెప్పిందే జరిగింది.. రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్

Recommended Video

Ram Charan Speech At Sye Raa Narasimha Reddy Success Meet || వాళ్ళ బాధలు ఎలా ఉంటాయో తెలిసింది!!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' భారీ రేంజ్‌లో విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 5000 థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని కాసుల పంట పండిస్తోంది. దేశవిదేశాల్లో ఉయ్యాలవాడ వీరుడి వీరత్వం చూసి ఫిదా అవుతున్నారు ఆడియన్స్. దీంతో తొలిరోజే ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. ఈ మేరకు చిత్రయూనిట్ థాంక్స్ మీట్ నిర్వహించారు.

ఎక్కడి నుంచో మొదలు పెట్టాలో తెలియడం లేదంటూ

ఎక్కడి నుంచో మొదలు పెట్టాలో తెలియడం లేదంటూ

ఈ వేదికపై నిర్మాత రామ్ చరణ్ మాట్లాడుతూ చిత్ర యూనిట్ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్పారు. ఎక్కడి నుంచో మొదలు పెట్టాలో తెలియడం లేదంటూ తన ప్రసంగం ప్రారంభించిన రామ్ చరణ్.. పరుచూరి ఆలోచనలకు శిరస్సు వంచి నమస్కరించారు. మాకు గురువులుగా ఉన్న మీ ఇద్దరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు చెర్రీ.

ఈ సినిమాకు నా బ్యాక్ బోన్ ఇద్దరే ఇద్దరు

ఈ సినిమాకు నా బ్యాక్ బోన్ ఇద్దరే ఇద్దరు

ఈ సినిమాతో పాటు తాను కూడా సినిమా షూటింగ్ చేస్తున్నాను కాబట్టి.. ఈ సినిమాలో నా బ్యాక్ బోన్‌గా నిలిచారు హానీ అక్క, విద్య అక్క అని చెప్పారు రామ్ చరణ్. నాన్న గారికి సంబంధించిన అన్ని పనుల్లో భాగమవుతూ షూటింగ్ సమయంలో ఎక్కువ సమయం కేటాయించి సైరా పిల్లర్స్‌గా ఉన్నారు ఆ ఇద్దరూ అని చెప్పారు రామ్ చరణ్.

 జగపతి బాబు క్యారెక్టర్ గురించి

జగపతి బాబు క్యారెక్టర్ గురించి

ఈ సందర్బంగా జగపతి బాబుతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు రామ్ చరణ్. ఆయన మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ అని ఎంతో మంది తనతో చెప్పారని, వాళ్ళు ఎంత చెప్పినా అంతకంటే ఎక్కువగా 10 రేట్లు బ్యూటిఫుల్ పర్సన్ జగపతి బాబు గారు అని చెబుతూ ఆయనకు స్పెషల్ థాంక్స్ చెప్పారు రామ్ చరణ్.

తమన్నా, డైరెక్టర్ సురేందర్ రెడ్డిలకు

తమన్నా, డైరెక్టర్ సురేందర్ రెడ్డిలకు

తమన్నా తన ఫేవరేట్ యాక్టర్ తమన్నా అని చెబుతూ.. ఆమెకు స్పెషల్ థాంక్స్ చెప్పారు రామ్ చరణ్. అలాగే డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారికి మనస్ఫూరిగా ధన్యవాదాలు అని చెప్పారు. ఈ సక్సెస్ ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదని అన్నారు రామ్ చరణ్.

 రాత్రి పూట ఉలిక్కిపడి లేచే వాడిని.. పక్కనే దిల్ రాజు

రాత్రి పూట ఉలిక్కిపడి లేచే వాడిని.. పక్కనే దిల్ రాజు

గత నెల క్రిందట తాను రాత్రి పూట ఉలిక్కిపడి లేచే వాడినని, ఎందుకు అలా లేచే వాడినో నాకే తెలియలేదని అన్నారు చెర్రీ. బహుశా ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలందరికీ ఇలాంటి పరిస్థితే ఉంటుందేమో అనేయడంతో అక్కడే ఉన్న దిల్ రాజు పెద్దగా నవ్వేశారు. రాజమౌళి చెప్పినట్లు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఆశీస్సులు మాపై ఉన్నాయని అన్నారు రామ్ చరణ్. తల్లిదండ్రులకు, ప్రతీ ఒక్కరికీ థాంక్స్ అన్నారు చెర్రీ.

సైరా మూవీ విశేషాలు

సైరా మూవీ విశేషాలు

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విజయంతో రెండు తెలుగు రాష్ట్రాల మెగా అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X