twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ ఎంగేజ్మెంట్ కి 4కోట్లతో ముస్తాబైన దామకొండప్యాలెస్...!

    By Sindhu
    |

    రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ 'రచ్చ" ప్రస్తుతం ఫాస్ట్ గా షూటింగ్ జరపుకుంటోంది. ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమా ఏమిటా అని అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ చేయబోయే సినిమాల లిస్ట్ అయితే వుందిగానీ అందులో ఏ సినిమా ఫస్ట్ స్టార్ట్ అవుతుందనే విషయంలో క్లారిటీ లేదు. విశ్వసనీయ సమాచారం మేరకు చరణ్ నెక్ట్స్ వివి వినాయక్ సినిమా ఓకే చేసే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.

    అయితే రచ్చ షూటింగ్ పూర్తి కాకపోయినా డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకొని రెండు సినిమాల్లోనూ ఒకేసారి చేయాలన్నది చరణ్ ప్లాన్. డివివి దానయ్య నిర్మించే ఈ చిత్రం విజయదశమికి ప్రారంభం అవుతుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి..

    కాగా రామ్ చరణ్ వ్యక్తిగత పరంగా చరణ్, ఉపాసనా కామినేనిల నిశ్చితార్థం నవంబర్ లో జరగనుంది. ఈ వేడుకకు సంబంధించిన పనులను చిరు, కామినేని కుటుంబం మొదలు పెట్టేసిందట. ఉపాసన తాతకు చెందిన దామకొండగడి కోటలో ఈ వేడుక జరగనుంది. ఈగడికి దాదాపు 4కోట్లు ఖర్చువుతుందని సమాచారం. ఇక ఈ వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో రకరకాల వంటకాలను వడ్డించనున్నారట. నెల్లూరికి చెందిన వంగాళ్లతో నాన్ వెజిటేరియన్, తూ గో జి వారితో వెజిటేరియన్ వంటకాలను వండించనున్నానరి తాజాగా అందినటువంటి సమాచారం.

    English summary
    Ram Charan Teja and Upasana Kamineni’s engagement venue is getting ready. Its an old fort, Domakonda gadi, about 105 km from hyderabad. This belongs to Upasana’s grandfather and is now being repaired and decorated with cost of Rs.4 crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X