మెగాపవర్ స్టార్ ఇంటికి పెళ్లికళ...!?
ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రామ్ చరణ్ నిశ్చితార్ధానికి ముహుర్తం దగ్గరపడింది. మరో రెండు మూడు రోజుల్లో అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనుమరాలు ఉపాసనకు చెర్రీ రింగు తొడగనున్నారు. మెగాస్టార్ ఇంటికి పెళ్లి కళ వచ్చేసింది. త్వరలో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు. చిరుత ఎంగేజ్ మెంట్ ఏర్పాట్లలో కుటుంబసభ్యులు నిమగ్నమయ్యారు. నిశ్చితార్థ ముహూర్తాన్ని నిర్ణయించే పనిలో పడ్డారు. కొణిదెల , కామినేని కుటుంబాలకు మధ్య బంధుత్వం కలిసింది. అపోలో గ్రూప్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసనను చెర్రీ లవ్ మ్యారేజ్ చేసుకోనున్నాడు. వీరిద్దరి ప్రేమ పెద్దలు ఓకే చెప్పేయడంతో ఇరుకుటుంబాలు నిశ్చితార్థ పనుల్లో బిజీ అయ్యాయి. ఆగస్ట్ నెల చిరంజీవికి ఓ సెంటిమెంట్. సో... ఈ మాసంలోనే ఎంగేజ్ మెంట్ ముహూర్తం పెట్టుకోనున్నారు. ఈవిషయాన్ని కొద్దిరోజుల క్రితం మెగాస్టారే స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే
అమ్మాయి తరపు వారు ఎంగేజ్ మెంట్ పనుల్లో బిజీ అయ్యారు. సెప్టెంబర్ నెల చివరి వరకు మంచి రోజులు లేకున్నా చిరంజీవి ఆగస్ట్ సెంటిమెంట్ కారణంతో ఈ నెలలోనే వీరి నిశ్చితార్ధం జరపాలని నిర్ణయించారు. మరో రెండు మూడు రోజుల్లో ఎంగేజ్ మెంట్ మూహూర్తం ఖరారు కానుంది. ఉపాసన, చెర్రీల ఎంగెజ్ మెంట్ శుభ ముహుర్తంకోసం అటు ఫ్యాన్స్ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా ఆంక్సైటీగా ఎదురుచూస్తున్నారు. సో... టాలీవుడ్ మగధీరుడు తన పెళ్లి ఘడియలకోసం వేచిచూస్తున్నాడు. ఉపాసన వేలికి రింగు తొడిగి ప్రేమ యాత్రలో చెట్టాపట్టాలకు సిద్ధమవుతున్నాడు.


Click it and Unblock the Notifications











