రామ్ చరణ్ ఎంగేజ్ మెంట్ కి స్పెషల్ శేర్వాణి ఖరీదు ఒకటిన్నర లక్ష...!
డిసెంబరు 1వ తేదీన మెగాస్టార్ చిరంజీవి కుమారుడు, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ, అపోలో హాస్పిటల్స్ రెడ్డి మనవరాలు ఉపాసనల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరుపనున్నారు. ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలోనే ప్రముఖులకు ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఎంగేజ్ మెంట్ వేడుక హైదరాబాద్ లోని ఉపాసనాకు చెందిన రిసార్ట్ ముస్తాబయ్యింది. దాదాపు 300మంది గెస్ట్ లు ఈ వేడుకలో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఈ వేడుక కోసం డిజైనర్ రాజేష్ ప్రతాప్ సింగ్ రూ. 1.5 లక్షలతో రామ్ చరణ్ కి శేర్వాణి డిజైన్ చేసాడట. చోటా కె నాయుడు ఈ వేడుకను తన కెమెరాలో బంధించనున్నాడు.
ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి పర్యవేక్షణలో ఈ వేడుకకు కావాల్సిన వేదిక, మిగతా డెకరేషన్ అరేంజ్ మెంట్స్ జరిగాయని సమాచారం. మజార్, గౌరవ్ క్యాటరింగ్ అరేంజ్ మెంట్స్ ని చూసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ వేడుకను ఇటు చిరంజీవి కుటుంబ సభ్యులు, అటు ఉపాసనా కుటుంబ సభ్యులు చాలా గ్రాండ్ గా నిర్వహించడానికి ప్లాన్ చేసారట.


Click it and Unblock the Notifications











