రామ్ చరణ్ నిశ్చితార్థం-పెళ్ళి రెండూ కోటలోనే...!

By Sindhu

రామ్ చరణ్-ఉపాసనలను కలిపింది ఏవరు...?చిన్ననాటి స్నేహం..కామన్ ఫ్రెండ్స్ ఇవేమీ కాదు. గుర్రాలు. నిజమే..వారిద్దరినీ కలిపింది గుర్రాలే. ఈ విషయాన్ని రామ్ చరణ్ పరోక్షంగా ప్రస్తావించారు. తనకు గుర్రాలంటే పిచ్చి అని చెబుతూ అదే ఇవాళ అదే నన్ను పోలో టీమ్ కు ఓనర్ ని చేసింది. నా జీవితంలోకి ఉపాసనా ప్రవేశించినప్పటి నుంచి నా అభిరుచుల్ని తను బాగా గుర్తించింది. నాకు నాలుగు గుర్రాలు ఉంటే ఉపాసనకు కూడా నాలుగు గుర్రాలు ఉన్నాయి. తనకు హార్స్ రైడింగ్ ఇష్టమైతే..నాకు కూడా హార్స్ రైడింగ్ ఇష్టం. అస్సలు మేం కలుసుకున్నదే ముందుగా గుర్రాల దగ్గర. కార్ల రేసింగ్ అన్నా ఇద్దరికీ ఇష్టమే. ఇలాంటి కామన్ అభిరుచులే మమ్మల్నిద్దరిని మరింత దగ్గర చేశాయి అని అంటున్నాడు చరణ్.

ఆమధ్య జరిగిన జూ ఎన్టీఆర్ వివాహం తర్వాత టాలీవుడ్ లో మళ్లీ అంతటి ఆసక్తినీ, కుతూహలాన్నీ కలిగిస్తున్న విషయం రామ్ చరణ్ తేజా, ఉపాసనా కామినేనిల వివాహమే. వీరి వివాహానికి సంబంధించిన ప్రతి అంశం ఇప్పుడు ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించేదే. ఇక విషయానికొస్తే, వీరి నిశ్చితార్ధం నిజామాబాద్ జిల్లా దోమకొండ గాడీలో జరుగుతుందని వార్తలొస్తున్నాయి. ఆ కోట ఉపాసన తాతగారికి సంబంధించినది కావడంతో, ఆచారం ప్రకారం ఈ శుభాకార్యాన్ని అక్కడే నిర్వహించాలనుకుంటున్నారట. ఈ కార్యక్రమాన్ని నిర్వహణకు ఇరు కుటుంబాల వారు భారీ ఏర్పాట్లే చేస్తున్నారు. దీనికోసం వధువు కుటుంబానికి చెందిన నిజామాబాద్‌ జిల్లాలోని దోమకొండ కోట ముస్తాబవుతోంది. వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ కోటలో చెర్రీ-ఉపాసనల నిశ్చితార్థాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు అత్యంత వేగంగా సిద్ధమవుతున్నాయి. ఈ వార్తని తాజాగా రామ్ చరణ్ కూడా కన్ఫర్మ్ చేశాడు. నవంబర్లో తమ వివాహ నిశ్చితార్ధం దోమకొండలో జరుగుతుందనీ, వచ్చే జనవరిలో వివాహం కూడా దోమకొండ కోటలోనే జరుగుతుందనీ చరణ్ చెప్పాడు. నిశ్చితార్ధం అయ్యే వరకు తామిద్దరమూ కలిసి ఎక్కడా కనిపించమనీ, అది మన సంస్కృతీ కూడా కాదనీ చరణ్ అంటున్నాడు. అయితే, మేరేజ్ షాపింగ్ మాత్రం కలిసి చేస్తామని అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X