రామ్ చరణ్ ఇంట్లో సందడి చేసిన ఎన్టీఆర్... (ఫోటోస్)
Recommended Video

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో త్వరలో ఓ మల్టీ స్టారర్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మగధీర, బాహుబలి లాంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చిన్న తనం నుండి స్నేహితులైన చరణ్, ఎన్టీఆర్ ఈ సినిమాలో తొలిసారి కలిసి నటిస్తున్నారు.

రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్రెండ్షిప్
త్వరలో కలిసి నటించబోతున్న ఈ ఇద్దరు స్టార్లు.... తమ మధ్య ఉన్న స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా రామ్ చరణ్ ఇంట్లో జరిగిన క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో ఎన్టీఆర్ పాల్గొన్నారు.

రామ్ చరణ్ ఇంట్లో ఎన్టీఆర్
రామ్ ఇంట్లో జరిగిన క్రిస్మస్ సంబరాలకు ఎన్టీఆర్ హాజరయ్యారు. రామ్ చరణ్ భార్య ఉపాసన విస్తారాకులతో తయారు చేసిన క్రిస్మస్ ట్రీ వద్ద ఎన్టీఆర్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

ఈ వేడుకలో వీరు కూడా
రామ్ చరణ్ ఇంట్లో జరిగిన క్రిస్మస్ వేడుకలో హీరో శర్వానంద్, ‘అర్జున్‌రెడ్డి' దర్శకుడు సందీప్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

త్వరలో రామ్ చరణ, ఎన్టీఆర్ మల్టీస్టారర్
ఎన్టీఆర్, రామ్ చరణ్ చిన్నతనం నుండి స్నేహితులు. అయితే ఇద్దరూ ఎప్పుడూ కలిసి నటించలేదు. త్వరలో ఇద్దరూ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న మల్టీస్టారర్ చిత్రంలో నటించనున్నారు.

ఇద్దరూ బాక్సర్లుగా
ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో ఉంటుందని, ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ బాక్సర్లుగా కనిపించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా టైటిల్ కూడా బాక్సింగ్ క్రీడను గుర్తు చేసే విధంగా ఉంటుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











