వివాదంలో రామ్ చరణ్ బర్త్ డే సీడీపీ.. ట్వీట్ల వర్షం.. చెర్రీ ఫ్యాన్స్ ఫైర్
ప్రస్తుతం హీరోల అభిమానులు బాక్సాఫీస్ రికార్డులను, లెక్కలను అంతగా పట్టించుకోవడం లేదు. కానీ సోషల్ మీడియాను మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రతీ హీరోకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వారందరూ కలిసి సోషల్ మీడియాలో సపరేట్ అకౌంట్లు క్రియేట్ చేసి సదరు హీరో బర్త్ డేను సోషల్ మీడియాలో సెలెబ్రేట్ చేస్తుంటారు. అలా ప్రతీ హీరోకు తమ ఫ్యాన్స్ తరుపున కొన్ని అధికారిక అకౌంట్లు ఉంటాయి.

హీరోల బర్త్ డేలకు హంగామా..
తమ అభిమాన హీరో బర్త్ డే వస్తుందంటే.. ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా ఉండదు. హీరో బర్త్ డేకు వంద రోజులు ఉందని, యాభై రోజులు ఉందని, ఇంకా నెల రోజులే ఉందని ఇలా హడావిడి చేస్తుంటారు. ఇలా హీరో బర్త్ డే కోసం ఎంతో ప్లాన్ చేస్తుంటారు.

సీడీపీ అంటూ రచ్చ..
ఈ మధ్యే ఫ్యాన్స్ సీడీపీ అనే ట్రెండ్‌ను ప్రారంభించారు. తమ హీరో సినీ ప్రయాణం మొత్తం కూడా అందులో ప్రతిబింబించేలా ఓ కామన్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తుంటారు. దాన్ని ఓ స్థాయిలో సెలెబ్రిటీలందరి చేత ఒకేసారి రిలీజ్ చేయిస్తుంటారు. అయితే తాజాగా రామ్ చరణ్ ఫ్యాన్స్ సీడీపీ విషయంలో గుర్రుగా ఉన్నారు.

సింపుల్ సీడీపీ..
రామ్ చరణ్ బర్త్ డే మార్చి 27న అన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సీడీపీని రిలీజ్ చేశారు. మామూలుగా అయితే రామ్ చరణ్ ట్రెండ్స్ అంటూ ఓ ట్విట్టర్ అకౌంట్ మెగా పవర్ స్టార్ కోసం పని చేస్తుంటుంది. మామూలుగా అయితే వీరే సీడీపీని డిజైన్ చేసి వదలాల్సింది. కానీ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వాళ్లు ఓ సీడీపీని వదిలారు. అది చాలా సింపుల్‌గా ఉంది, పరువుపోయేలా ఉందని చెర్రీ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్యాన్స్ ఫైర్..
రామ్ చరణ్ సీడీపీపై వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, బండ్ల గణేష్ వంటివారంతా బాగుందని స్పందించారు. కానీ చెర్రీ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దానికంటే ఫ్యాన్స్ ఎడిటి్ చేసిన ఎన్నో పోస్టర్లు బాగున్నాయంటూ వాటిని షేర్ చేస్తున్నారు. అసలు ఆర్ఆర్ఆర్ స్టిల్ లేకుండా సీడీపీ ఏంటని ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు? నీ చుట్టూ ఉన్నవాళ్లని ఓసారి సరిగ్గా చూసుకో అన్నా అంటూ రామ్ చరణ్‌కు ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారు. మొత్తానికి ఈ సీడీపీ వివాదాన్ని క్రియేట్ చేసేసింది.


Click it and Unblock the Notifications











