పండుగ చేసుకుంటున్న రామ్ చరణ్ ఫ్యాన్స్
రామ్ చరణ్ ఫ్యాన్స్ నిన్నటినుంచి పండుగ జోష్ ని అనుభవిస్తున్నారు. తమ హీరో రామ్ చరణ్ చిత్రం రచ్చ గ్యారెంటీగా సూపర్ హిట్ అంటున్నారు. దానికి కారణం రచ్చలో లీక్ అంటూ విడుదలైన సాంగ్. మాస్ బీట్ తో సాగే ఆ సాంగ్ ఇప్పుడు అంతటా వినిపిస్తోంది. ఆ బీట్,పాట విన్న ఫ్యాన్స్ ఈ పాటను బట్టే తమ చిత్రం ఏ రేంజిలో ఉంటుందో ఎక్సపెక్ట్ చేయవచ్చని అంచనాలు వేసుకుంటున్ననారు. ఇప్పటివరకూ ఈ చిత్రానికి సంభందించి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయలేదు.
ఆరెంజ్ తర్వాత వస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ పై అనవసరమైన అంచనాలు క్రియేట్ అయ్యి హైప్ రాకూడదన్నట్లుగా చాలా జాగ్రత్తగా ప్లానింగ్ ప్రకారం రామ్ చరణ్ వ్యవహిస్తూ వస్తున్నారు. ఎక్కడా బయిట కూడా ఈ చిత్రం గురించి ఇంటర్వూలు ఇవ్వటం లేదు. ఇక లీకైన ఈ పాట సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లోనూ,ఈమెయిల్స్,పబ్లిక్ ఫోరంల లోనూ మారు మ్రోగుతోంది. అందులోనూ ఒరిజనల్ సిడీనుంచి విడుదలైనట్లుగా హై క్వాలిటీ వెర్షన్ కావటంతో మరింతగా ఆకట్టుకుంటోంది. చాలా గ్యాప్ తర్వాత మణిశర్మ ఈ పోటీని తట్టుకునేందుకు కానీ తన సత్తాను మరోసారి చూపటానికి అన్నట్లుగా పాటను ట్యూన్ చేసి అందించారు. మధ్యలో వచ్చే తీన్ మార్ బీట్ కి ధియోటర్ లో డాన్స్ల్ లు ఖాయం అంటున్నారు.


Click it and Unblock the Notifications











