‘మగధీర’ తెచ్చిన తిప్పలు-భాస్కర్ కి మోతలు
మగధీర అంతటి సంచలన విజయం సాధించడం ఎందరిని ఆనందపెడుతున్నా ఒకరిని మాత్రం తెగ ఇబ్బంది పెడుతోంది. చరణ్ తో మలి చిత్రం చేయడానికి సిద్దపడుతోన్న అంచనాలను అందుకోవడానికి కుస్తీలు పడుతున్నాడట. తదుపరి చిత్రం ఫ్యామిలీస్ ని ఆకట్టుకునే సాఫ్ట్ మూవీ అయి వుండాలని చరణ్ డిసైడైనా కానీ 'మగధీర" తర్వాత వచ్చే చిత్రంపై వుండే అంచనాలు మాత్రం అధికంగా వుంటాయి కనుక భాస్కర్ పని కత్తి మీద సామయింది.
'పరుగు" హిట్టనిపించుకున్నా 'బొమ్మరిల్లు"తో తాను సెట్ చేసుకున్న స్టాండర్డ్స్ ని భాస్కర్ అందుకోలేకపోయాడన్నది నిజం. దాంతో చరణ్ చిత్రం తనకి వ్యక్తిగతంగాను ప్రతిష్టాత్మకంగా మారింది. 'అరెంజ్" అనే వర్కింగ్ టైటిల్ తో భాస్కర్ చేస్తోన్న ఈ స్ర్కిప్టు విషయంలో ఇంకా తర్జనభర్జనలు జరుగుతూనే వున్నట్టు ప్రచారం. భాస్కర్ రాసుకున్న కథలోని ద్వితీయార్థంపై మెగా హీరోల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదని టాక్. ఇదిలా వుంటే మరో పక్క చరణ్ అభిమానులు ఈ సినిమాను త్వరగా పూర్తి చేయాలని, మా అభిమాన కథాకాయకుడి సినిమా కోసం మేం చాలా రోజులు ఆగలేం..'మగధీర" లాగా లేట్ చెయ్యొద్దు, త్వరగా సినిమా పూర్తి చేయాలని చరణ్ అభిమానులు కొంతమంది భాస్కర్ కి వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











