»   » చెర్రీపై చిరుకు కోపం వచ్చిన సందర్భం... (ఫాదర్స్ డే మెమొరీస్)

చెర్రీపై చిరుకు కోపం వచ్చిన సందర్భం... (ఫాదర్స్ డే మెమొరీస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఫాదర్స్ డే సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం 1985' సినిమా షూటింగులో బిజీగా ఉన్న రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి గురించి విషయాలు మీడియాతో పంచుకున్నారు.

తన జీవితంలో ఒకే ఒకసారి నాన్న తనపై కోప్పడ్డారని, ఆ తర్వాత ఆయన ఎప్పుడూ తనపై కోప్పడిన సందర్భం అసలు లేనే లేదని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. తన తండ్రి చాలా గొప్పమనిషి అంటూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. దీంతో పాటు తన ఎఫ్‌బి పేజీలో నాన్నకు ఫాదర్స్ డే విషెస్ చెబుతూ కొన్ని రేర్ ఫోటస్ అభిమానులతో పంచుకున్నారు.

కోప్పడిన సందర్భం

కోప్పడిన సందర్భం

ఒకసారి అమ్మానాన్నతో కలిసి కూర్చుని మాట్లాడుకొంటున్నప్పుడు ‘వెళదాం పదరా' అని ఆమ్మ అనగానే... ‘వెళ్దాంలే...కూర్చో' అని అమ్మకు ఎదురు చెప్పడంతో నాన్నకు చాలా కోపం వచ్చిందని రామ్ చరణ్ తెలిపారు.

నాన్నకు అసలు కోపం రాదు

నాన్నకు అసలు కోపం రాదు

నాన్నకు సాధారణంగా అసలు కోపం రాదు, ఆ రోజు అమ్మకు ఎదురు చెప్పడంతో ఆయనకు కోపం వచ్చింది. అమ్మమాటకు ఎదురు చెప్పకూడదు అంటూ ఆరోజు క్లాస్ పీకిన సందర్భం నాకు ఇంకా గుర్తుంది అని రామ్ చరణ్ గుర్తు చేసుకున్నాడు.

మహిళలంటే గౌరవం

మహిళలంటే గౌరవం

నాన్న చాలా గొప్ప మనిషి, చాలా సేవా భావం ఉన్న వ్యక్తి. మహిళలంటే ఎంతో గౌరవం. ఇక అమ్మ అంటే నాన్నకు ఎంతో ఆప్యాయత. మా ముగ్గురు పిల్లలను ఆయన ఎంతో ప్రేమగా చూసుకుంటారు అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.

అమ్మతో అనుబంధం గురించి

అమ్మతో అనుబంధం గురించి

అమ్మతో నాకు చాలా అనుబంధం ఉందని చెప్పాడు. తన ఆనందం, విచారం అన్నీ ఆమెతోనే పంచుకునే వాడినని, తామిద్దరం ఎంత ప్రేమగా ఉంటామో, అప్పుడప్పుడు అంతే స్థాయిలో గొడవ పడతాం, మాటామాటా విసురుకుంటామని రామ్ చరణ్ తెలిపారు.

ఫాదర్స్ డే విషెస్

ఫాదర్స్ డే విషెస్

నాన్నకు పాదర్స్ డే విషెస్ చెబుతూ ఫేస్ బుక్ పేజీలో చెర్రీ ఓ పోస్టు చేశారు. ‘హ్యాపీ ఫాదర్స్ డే డాడ్. నీకు సంబంధించి సెలబ్రేట్ చేయడానికి ఏ చిన్న అవకాశం దొరికినా నాకు ఆనందమే. లవ్ యూ డాడ్ అంటూ' పేర్కొన్నారు.

English summary
"Happy Father's day dad. I wouldn't leave a single chance to celebrate the amazing person that you are. Thank you for always believing in us more than we ever did. Love you" Ram Charan posted in FB.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu