బెర్రీలో చెర్రీ..!(రామ్ చరణ్‌కు ఇంటర్నేషనల్ ఖ్యాతి)
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు దేశీయంగానే కాదు...ఇంటర్నేషనల్ లెవల్లో గుర్తింపు ఉందని తాజాగా వెల్లడైంది. ఇంటర్నేషనల్ మొబైల్ దిగ్గజం బ్లాక్ బెర్రీ రూపొందించిన యాడే ఇందుకు నిదర్శనం. ఆ కంపెనీ కొత్తగా విడుదల చేసిన '10 టచ్ అండ్ క్వారీ'ఫోన్ యాడ్లో మెగా పవర్ స్టార్ ఫీచర్ గా మారి పోయాడు.
ఈ సంస్థ విడుదల చేసిన యాడ్ వీడియోలో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిన పలువురిని అందులో చూపెట్టారు. అందులో రామ్ చరణ్ కూడా కనిపించడం అభిమానులను మరింత ఉత్సాహాన్ని ఇచ్చినట్లయింది. తమ హీరోకి ఇంటర్నేషనల్ లెవల్ లో గుర్తింపు ఉండటం ఎంతో గొప్పవిషయమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ ఇప్పటికే పలు ప్రైవేట్ టెలికం కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవరిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం రామ్ చరణ్ 'నాయక్' చిత్రంలో నటిస్తున్నాడు. వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో చెర్రీ డ్యూయల్ రోల్ చేస్తుండగా....అతని సరసన సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ నటిస్తున్నారు. 'నాయక్' షూటింగ్ ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇక్కడ సినిమాకు సంబంధించిన కీలకమైన ఫైటింగ్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు.
రామ్ చరణ్ ఈచిత్రంతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంలో, బాలీవుడ్లో 'జంజీర్' చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ మూడు చిత్రాలకు డేట్స్ అడ్జెస్ట్ చేసుకుంటూ తీరిక లేకుండా కష్ట పడుతున్నాడు చరణ్. తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవాలనే కసి రామ్ చరణ్‌లో కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











