రామ్ చరణ్ చిత్రం పక్కా మాస్..నాగబాబు
రామ్ చరణ్ తేజ లేటెస్ట్ చిత్రం 'ఆరెంజ్' లో మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలను కూడా కలిగి ఉంటుందనిర్మాత నాగబాబు చెప్తున్నారు. ఆయన తాజాగా అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. 'బొమ్మరిల్లు' చిత్రం రూపొందించిన భాస్కర్ దర్శకుడు కావటంలో ఆ రకంగానే రామ్ చరణ్ చిత్రం ఊహిస్తారని భావించే నాగబాబు ఇలా స్టేట్ మెంట్స్ ఇస్తున్నారంటున్నారు. ఇక కె.వెంకట్రావు సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రం ఈ నెల 23 నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుంది.
జనవరి 10 నుంచి సిడ్నీలో ఈ చిత్రం మేజర్ షెడ్యూలు జరుగుతుంది. మార్చి వరకు అక్కడే షూటింగ్ జరుపుతామని నిర్మాత నాగేంద్రబాబు చెప్పారు. అలాగే ఈ చిత్రం ఎలా ఉండబోతోందనే విషయం చెపుతూ..'సెంటిమెంట్‌ని, ఫ్యామిలీ ఎమోషన్స్‌ని, ఎంటర్‌టైన్‌మెంట్‌ని, మానవతా విలువలను పండించే భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రొమాంటిక్ లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటూనే మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలను కూడా కలిగి ఉంటుంది' అన్నారు. జెనీలియా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి సినిమాట్రోగఫీ: కిరణ్‌రెడ్డి, సంగీతం: హేరిస్ జైరాజ్, ఆర్ట్: ఆనంద్ సాయి, స్టంట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మన్యం రమేష్


Click it and Unblock the Notifications











