రచ్చ రామ్ చరణ్ దే ఫిక్స్ అయిపోయారు..!
జూ ఎన్టీఆర్, సురేందర్ రెడ్డి సినిమా స్టార్ట్ కాగానే దాని టైటిల్ 'రచ్చ" అని మీడియాలో రచ్చ చేశారు. అయితే ఆ టైటిల్ వాళ్లెలా పెట్టుకుంటారంటూ డైరెక్టర్ సంపత్ నంది రచ్చ, రచ్చ చేసి, ఆ టైటిల్ పై సర్వాధికారాలు తనవేనంటూ రచ్చకెక్కాడు. ఫైనల్ గా ఎన్టీఆర్ సినిమాకి రచ్చ టైటిల్ వద్దనుకుని 'ఊసరవెల్లి" పేరుకే ఫిక్సయిపోయారు. ఎవరైనా మాస్ హీరోతో చేయడానికని సంపత్ నంది రాసుకున్న రచ్చ కథని విన్న చరణ్ అది చేయడానికి అంగీకరించాడు.
'ఏమైంది ఈవేళ' చిత్రంతో సంపత్ నందికి మంచి మార్కులే పడ్డాయి. అందుకే కాబోలు రామ్ చరణ్ తేజ ఈ సినిమా చేయడానికి ఓప్పేసుకొని, ఈ మాస్ చిత్రానికి 'రచ్చ' అనే టైటిల్ ని పెడుతున్నట్టు రామ్ చరణ్ చెబుతున్నాడు. ప్రస్తుతం కొత్త లుక్ కోసం అమెరికాలోని మియామీలో ఫిజికల్ ట్రైనింగ్ పొందుతున్న చరణ్ మరో పది రోజుల్లో హైదరాబాదు వస్తున్నాడు. రాగానే ఈ సినిమా షూటింగును ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











