సినిమాలకు బ్రేక్ వేసిన రామ్ చరణ్!

By Bojja Kumar

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తాత్కాలికంగా తన సినిమా షూటింగులకు బ్రేక్ వేశారు. జూన్ 14న చెర్రీ వివాహం తను మనసు పడ్డ ప్రేయసి ఉపాసనతో జరుగనున్న నేపథ్యంలో 15 రోజుల ముందుగానే బ్రేక్ తీసుకున్నారు. పెళ్లి, తదనంతర కార్యక్రమాలతో పాటు హనీమూన్ ట్రిప్ ముగిసే వరకు చెర్రీ సినిమాలుకు దూరంగా ఉండనున్నాడు. ఈ విషయాన్ని చరణ్ త ట్విట్టర్లో పేర్కొన్నాడు. 'Atlast free frm all the shoots till the wedding..' అంటూ ట్వీట్ చేశాడు.

ప్రస్తుతం చరణ్ నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. చెర్రీ బాలీవుడ్ డెబట్ చిత్రం 'జంజీర్'తో పాటు...వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎవడు', మరో వైపు వివి వినాయక్ దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న 'చెర్రీ' చిత్రం షూటింగులు జరుగుతున్నాయి.

వీరి వివాహం మొయినాబాద్ ప్రాంతంలోని ఉపాసన ఫాం హౌజ్‌లో జరుగనుంది. ఇరు కుటుంబాల వారు రాజకీయంగా, సీనీ రంగంలో భాగా పలుకు బడి ఉన్న వారు. ఈ నేపథ్యంలో తమ ముద్దుల వారసులు రామ్ చరణ్, ఉపాసన వివాహం దేశ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈ వెంట్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ వేడుక కోసం సినిమాలో మాదిరి భారీ సెట్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ బాధ్యతను టాలీవుడ్ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయికి అప్పగించారు. ఇందుకోసం దాదాపు రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు ఖర్చు పెడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X