హిందీలో జెర్సీ డిజాస్టర్.. ఆ దర్శకుడితో చేయాల్సిన సినిమాపై చరణ్ ఏమన్నాడంటే?

కరోనా కారణంగా చాలా వరకూ హీరోలు దర్శకులు కూడా వారి భవిష్యత్తు ప్రాజెక్టులపై నిర్ణయాలు తీసుకోవడంలో చాలా వేగంగా ఆలోచించారు అనే చెప్పాలి. ఎందుకంటే అంతకు ముందు వరకు ఒక సినిమా పూర్తి అయితే గాని మరొక సినిమా గురించి ఎక్కువగా ఆలోచించే వారు కాదు. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపు రెండేళ్ల కాలం వృధా కావడంతో రాబోయే రెండు మూడేళ్లలో వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసి మళ్లీ బాక్సాఫీస్ స్థాయిని పెంచుకోవాలి అని అనుకుంటున్నారు. ప్రస్తుతం అయితే మన స్టార్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా సినిమాలను సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే.

ఇక ఇటీవల RRR సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రామ్ చరణ్ తేజ్ కూడా బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి కోసం ప్రత్యేకంగా నటించాలి అనే ఆచార్య సినిమా చేసిన రామ్ చరణ్ తేజ్ అనుకున్నంత స్థాయిలో అయితే బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేక పోయాడు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కూడా పాన్ ఇండియా మూవీ గానే తెరపైకి రానుంది. ఇక రామ్ చరణ్ లిస్టులో గౌతమ్ తిన్ననూరి తో కూడా ఒక ప్రాజెక్టుకు కమిట్ అయ్యాడు. ఆ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి రానుంది.

ఆ సినిమా కూడా భారీ స్థాయిలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. అయితే ఆ దర్శకుడు ఇటీవల హిందీలో జెర్సీ సినిమాను రీమేక్ చేశాడు. పాజిటివ్ టాక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం నిలదొక్కుకోలేకపోయింది. చాలా దారుణమైన కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి తేలేకపోయినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. కానీ ప్రముఖులు మాత్రం ఆ సినిమా దర్శకుడు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Ram charan full confidence on jersey movie director Gowtam Tinnanuri

అయితే హిందీలో జెర్సీ సినిమా డిజాస్టర్ కావడంతో రామ్ చరణ్ తో చేయబోయే సినిమా పై ప్రభావం చూపుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ తరుణంలో రామ్ చరణ్ అతనితో సినిమా చేస్తాడా లేదా అని సందేహాలు కూడా వస్తున్నాయి. అయితే రామ్ చరణ్ ఇటీవల ఆ దర్శకుడితో తప్పకుండా సినిమా చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు. గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని అనిపిస్తోంది.

ఎందుకంటే రామ్ చరణ్ ఆచార్య సినిమా ప్రమోషన్ లో కూడా త్వరలోనే మొదలు పెట్టబోతున్నట్లు వివరణ ఇచ్చాడు. ప్రాజెక్టు స్క్రిప్టు కూడా ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఆ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్నట్లు గతంలో టాక్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ సినిమా అలాంటి జానర్ లో రావడం లేదు అని రామ్ చరణ్ వివరణ ఇచ్చాడు. ఇక రామ్ చరణ్ రామ్ చరణ్ ఆ సినిమాతో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X