Mega Fan Vs Allu Fan war: మెగా సామ్రాజ్యంలో సింహాలకే చోటు.. అల్లు అర్జున్‌పై మెగా ఫ్యాన్స్ బూతులు

Game Changer: దాదాపు మూడేళ్ళుగా ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్ కు ఇవాళ మెగా ట్రీట్ అందింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)- సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) కాంబోలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'గేమ్ చేంజర్' (Game Changer). ఈ మోస్ట్ వెయిటెడ్ మూవీకి సంబంధించిన టీజర్ విడుదలైంది. ఈ తరణంలో హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మెగా ఫ్యాన్స్ చేతుల్లో వివాదాస్పద ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ 'గేమ్ చేంజర్' (Game Changer). ఈ మూవీకి సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) దర్శకత్వం వహిస్తుండగా.. ఈ భారీ బడ్జెట్ మూవీకి శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ (Sirish) నిర్మిస్తున్నారు. ఈ మోస్ట్ వెయిటెడ్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీలో అంజలి, సముద్రఖని, ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

Ram Charan Game Changer teaser released moment controversy plexes displayed by maga fans at Sudarshan theater in Hyderabad

ఈ భారీబడ్జెట్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలువనున్నది. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలో వచ్చే ఏడాది జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయంపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో మూవీపై మరింత అంచనాలు పెంచాలనీ, అలాగే.. మెగా అభిమానులకు మెగా ట్రిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మూవీ టీం భావించింది.

నేడు లక్నోలో ఈ టీజర్ ఈవెంట్ ‏గ్రాండ్ గా నిర్వహించింది మూవీ టీం. అలాగే.. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో సిటీలతోపాటు దేశవ్యాప్తంగా 11 చోట్ల ఈ టీజర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇలా గేమ్ చేంజర్ టీజర్ ను సాయంత్రం 6:03 గంటలకు విడుదల చేశారు. ఎంతో ఈగర్‌గా ఎదురు చూస్తోన్న గేమ్ చేంజర్ టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.

Ram Charan Game Changer teaser released moment controversy plexes displayed by maga fans at Sudarshan theater in Hyderabad

ఇక్కడి వరకూ అంత బాగానే ఉన్నా.. హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ వద్ద మాత్రం కాస్త ఉద్రిక్తత వాతావరణం నెలకొందనే చెప్పాలి. మెగా అభిమానుల చేతిలో వివాదాస్పద ఫ్లేక్సీలు కనిపించాయి. అందులో అల్లు అభిమానులను రెచ్చగొట్టేలా.. 'AA.. ఏం పీకలేరు బ్రదర్', 'మెగా సామ్రాజ్యంలో సింహాలే ఉంటాయి. కుక్కలకి, నక్కలకి చోటు లేదు. కొణిదెల కొదమ సింహాలు', 'ఈశ్వర్ అల్లా యేసు అతడే కదరా బాసు' రాసి ఉన్న పలు వివాదాస్పద పెక్సీలు ప్రదర్శించారు. అలాగే..జై చిరంజీవి .. జై పవర్ స్టార్, జై చరణ్ అనే నినాదాలతో థియేటర్ మారుమోగింది.

ఇటీవల అల్లు అర్జున్ ఫ్యాన్స్.. మెగా ఫ్యాన్స్ ను రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఆ ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ.. గుమ్ము 'గుండు 'అంటూ 'ఏం పీకలేరు బ్రదర్ 'అంటూ ఫ్లెక్సీలు ఆన్లైన్లోనే, ఆఫ్ లైన్ లోనే వైరల్ అయిన విషయం తెలిసింది. ఆ ఫ్లెక్సీల ఎపిసోడ్ కు కౌంటర్ గాని నేడు మెగా ఫ్యాన్స్ ఫ్లెక్సీలను ప్రదర్శించినట్లు తెలుస్తుంది.

ఈ వివాదం ఇలానే కొనసాగితే అటు పుష్ప కలెక్షన్స్ పైన.. ఇటు గేమ్ చేంజర్ వసుళ్లపై ప్రభావం పడే అవకాశం ఉందంటూ సినీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అల్లు అర్జున్ గాని, మెగా హీరోస్ గాని ఎవరైనా తగ్గితే.. ఈ వివాదానికి తెరపడేపడే అవకాశం ఉంటుందని ఇండస్ట్రీలో టాక్. పుష్ప రిలీజ్ కు ఇంకా నెల రోజులే సమయం ఉండడంతో పుష్ప మూవీ మేకర్స్ కూడా టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: game changer pushpa
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X