గౌరవం: సెంటరాఫ్ అట్రక్షన్‌గా రామ్ చరణ్ (ఫోటోలు)
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, ప్రము ఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు, అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్‌ని హీరోగా పరిచయం చేస్తూ ప్రకాష్‌రాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధామోహన్ దర్శకత్వంలో నిర్మాత ప్రకాష్‌రాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం 'గౌరవం'. యామి గౌతం హీరోయిన్ గా చేస్తోంది.
ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఏప్రిల్ 19న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈచిత్రం ట్రైలర్ రిలీజైంది. ఈకార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో ఇంకా అల్లు అరవింద్, చిన్ని కృష్ణ, బీవీఎస్ రవి, రాధామోహన్, దిల్ రాజు, బండ్ల గణేష్ తదితరులు హాజరయ్యారు.
అల్లు శిరీష్, యామి గౌతమ్, ప్రకాష్‌రాజ్, నాజర్, మధు, బ్రహ్మాజీ, హరీష్ నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. థమన్, కథా సహకారం: బి.వి.ఎస్.రవి, పాటలు: చంద్రబోస్, ఎడిటర్: అలెన్, సినిమాటోగ్రాఫర్: ప్రీత, నిర్మాత: ప్రకాష్‌రాజ్, కథ, మాటలు, దర్శకత్వం: స్క్రీన్‌ప్లే: రాధామోహన్.

గౌరవం ట్రైలర్ రిజలీ కార్యక్రమంలో రామ్ చరణ్, శిరీష్

గౌరవం హీరో హీరోయిన్లతో చెర్రీ

రామ్ చరణ్ తో ఆనందాన్ని పంచుకుంటున్న శిరీష్

అల్లు శిరీష్, రామ్ చరణ్, యామి గౌతం

మాట్లాడుతున్న రామ్ చరణ్

నిర్మాత బండ్ల గణేష్ తో రామ్ చరణ్

గౌరవం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి హాజరవుతున్న చెర్రీ.


Click it and Unblock the Notifications











